సమీక్ష : ధనుష్ “తిరు” – అక్కడక్కడా మెప్పించే ఫామిలీ డ్రామా

సమీక్ష : ధనుష్ “తిరు” – అక్కడక్కడా మెప్పించే ఫామిలీ డ్రామా

Published on Aug 19, 2022 3:01 AM IST
thiru Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 18, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ధనుష్, నిత్యా మీనన్,రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్, ప్రకాష్ రాజ్

దర్శకత్వం : మిత్రన్ ఆర్ జవహర్

నిర్మాతలు: కళానిధి మారన్

సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్

ఎడిటర్: ప్రసన్న జికె

లేటెస్ట్ గా తెలుగు సినిమా దగ్గర సడెన్ గా డబ్ అయ్యి రిలీజ్ అయిన చిత్రం “తిరు”. గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం పెద్దగా హడావుడి లేకుండానే రిలీజ్ అయ్యిపోయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథలోకి వస్తే.. తిరు(ధనుష్) తన తండ్రి(ప్రకాష్ రాజ్) అలాగే తన తాతయ్య(భారతీ రాజా) తో కలిసి సాధారణ లైఫ్ సాగిస్తూ ఉంటాడు. అయితే వీరిలో తిరు తన తాతయ్యతో బాగా దగ్గరగా ఉంటాడు. ఇలా మరోపక్క తిరు చిన్ననాటి ఫ్రెండ్ గా శోభన(నిత్య మీనన్) కనిపిస్తుంది. కానీ తిరు మాత్రం మరో అమ్మాయి(రాశీ ఖన్నా) ని లవ్ చేస్తాడు. అయితే అనుకోని విధంగా ఆమె అతని ప్రేమను ఒప్పుకోకపోవడం.. మరో పక్క ధనుష్ లైఫ్ లో మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అతని లైఫ్ ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఈ పరిస్థితులను తిరు ఎలా నెట్టుకొస్తాడు? తన కుటుంబం, తన లవ్ లో జరిగిన మార్పులు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

ధనుష్ కి బాగా సెట్టయ్యే అన్ని జానర్స్ లో ఫ్యామిలీ డ్రామా కూడా ఒకటి. ఇలాంటి సినిమాల్లో ధనుష్ నటన మరింత సహజంగా మన తోటి మనలోని పాత్రలను చూసినట్టు ఉంటుంది. మరి దానిలానే ఈ తరహాలో ఉండే పాత్రని కూడా తాను చాలా సెన్సిబుల్ ఎమోషన్స్ తో చాలా బాగా చేసాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ మరియు తన తండ్రితో ఉండే ఫ్యామిలీ సీన్స్ లో మెస్మరైజ్ చేసి తనలోని నటుడిని అద్భుతంగా ప్రదర్శితం చేసాడు.

ఇంకా నిత్య మీనన్ తన రోల్ లో డీసెంట్ గా చేసింది. తన పాత్రకి తెలుగులో డబ్ చెప్పకపోయినా తన రోల్ ఆమె నాచురల్ నటన లుక్స్ తో మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. అలాగే చిన్న క్యామియో లో కనిపించిన రాశీ ఖన్నా కూడా మెప్పిస్తుంది.. మరి నటీనటుల్లో అయితే మరి కీలక పెర్ఫామర్ భారతీరాజా కోసం చెప్పుకోవాలి. ధనుష్ తో తనకి ఉండే ప్రతి సీన్ ఆకట్టుకునేలా ఉండడమే కాకుండా వాటిలో తాను మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మేజర్ గా మెప్పించని పాయింట్ ఏమన్నా ఉంది అంటే అది ఈ సినిమా కథే అని చెప్పాలి. పెద్దగా కొత్తదనం ఉండే లైన్ అయితే కనిపించదు. పైగా మన తెలుగులో సడెన్ గా అనౌన్స్ చేసిన డబ్ సినిమా కూడా కావడంతో నిత్య మీనన్, ప్రకాష్ రాజ్ లాంటి నటులు సొంత వాయిస్ కూడా వినిపించదు. దీనితో అయితే వారి సీన్స్ లో డెఫినెట్ గా ఆడియెన్స్ లో మరింత ఆసక్తి తగ్గుతుంది.

అలాగే కొన్ని ఓల్డేజ్ తమిళ్ సినిమాల్లో ఉండే ఫ్లేవర్ కూడా బాగా ఎక్కువ కనిపిస్తుంది. దీనితో ప్రస్తుత ట్రెండ్ కి తగ్గ సినిమాలా అనిపించదు. మరి అలాగే ప్రకాష్ రాజ్ మరియు ధనుష్ మధ్య అయితే ఇంకా మంచి సన్నివేశాలు ఏమన్నా యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా చాలా వరకు సీన్స్ పరమ రొటీన్ గా ఊహించదగేలా ఉండడం కూడా మరో మైనస్ అని చెప్పాలి.

 

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు నేపథ్యానికి తగ్గట్టుగా కరెక్ట్ గా పెట్టారని చెప్పొచ్చు. అలాగే తమిళ్ వెర్షన్ లో టెక్నీకల్ టీం వర్క్ బాగుండి ఉండొచ్చు కానీ తెలుగులో ఎందుకు సడెన్ గా అనౌన్స్ చేయడం డబ్బింగ్ లాంటి విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి రిలీజ్ చేయడం అనేవి మెప్పించావు. అలాగే ఎడిటింగ్ లో అయితే ఓ సాంగ్ ని తీసేసి ఉండాల్సింది దాని వల్ల టైం సేవ్ అయ్యి ఉండొచ్చు. అనిరుద్ సంగీతం బాగుంది.

ఇక దర్శకుడు మిత్రన్ విషయానికి వస్తే తాం డీసెంట్ వర్క్ అందించారు. ఒక రకంగా కథ రొటీన్ లైన్ అయినా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ని తాను బాగా పట్టుకున్నారు. ఇవి కొన్ని సందర్భాల్లో బాగా ఎలివేట్ అయ్యాయి. అలాగే వాటికి తగ్గట్టుగా మంచి నటనను కూడా నటీనటులు నుంచి తాను రప్పించుకోవడం మంచి విషయం. ఓవరాల్ గా అయితే తన వర్క్ పర్లేదని చెప్పొచ్చు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “తిరు” పెద్దగా బజ్ లేకుండానే తెలుగులో వచ్చినా ధనుష్ వెర్సిటైల్ నటన సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే డెఫినెట్ గా మెప్పిస్తాయి. తెలుగు వెర్షన్ కి మంచి ప్రమోషన్స్ ఏమన్నా చేసి ఉంటే బాగుండేది. కాకపోతే రొటీన్ గా ఉండే కథ కొన్ని మైనస్ పాయింట్స్ పక్కన పెడితే ఈ ఫ్యామిలీ డ్రామాని వీలయితే ఒకసారి చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు