సమీక్ష : అన్ స్టాపబుల్ – చాలా లిమిటెడ్ ఫన్ డ్రామా

సమీక్ష : అన్ స్టాపబుల్ – చాలా లిమిటెడ్ ఫన్ డ్రామా

Published on Jun 10, 2023 3:02 AM IST
Unstoppable Movie Review In Telugu

విడుదల తేదీ : జూన్ 09, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విజె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సా ఖాన్, బిత్తిరి సత్తి, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి, రాజా రవీంద్ర, రఘు బాబు, విక్రమాదిత్య తదితరులు

దర్శకులు : డైమండ్ రత్న బాబు

నిర్మాతలు: రంజిత్ రావు

సంగీత దర్శకులు: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: వేణు మురళీధర్ వి

ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో బిగ్ బాస్ విన్నర్ సన్నీ అలాగే ప్రముఖ కమెడియన్ సప్తగిరి నటించిన చిత్రం “అన్ స్టాప్పబుల్”. మరి ఓ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు ఎంటర్టైన్ చేసిందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక ఈ సినిమాలో లైన్ లోకి వస్తే..కోహినూర్ కళ్యాణ్(విజె సన్నీ) అలాగే జిలాని రామదాస్(సప్తగిరి) తన చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుని ఓ క్రికెట్ బెట్టింగ్ లో అయితే పోగొట్టుకుంటారు దీనితో డబ్బులు కోసం తమ మరో ఫ్రెండ్ హనీ బాబు(షకలక శంకర్) సాయం కోరగా తను పొరపాటున ఆ డబ్బులు జ్ఞ్యానవేల్ రాజా అలియాస్ ఖాదర్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. తీరా కట్ చేస్తే ఈ ఖాదర్ ఓ పేరుమోసిన డాన్. మరి ఈ పరిస్థితి నుంచి కళ్యాణ్ జిలానీలు ఆ డబ్బులు ఎలా రాబట్టుకుంటారు? జిలాని తన చెల్లి పెళ్లి చేశాడా లేదా అనేది మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

రీసెంట్ గా ఏటీఎం సిరీస్ లో కనిపించి మెప్పించిన వీజే సన్నీ ఈ చిత్రంలో కూడా మంచి నటనతో అయితే ఆకట్టుకుంటాడు. తన లుక్స్, డైలాగ్ డెలివరీ బాగుంది. అలాగే తన కామెడీ టైమింగ్ సహా కొన్ని మాస్ షేడ్స్ సినిమాలో బాగున్నాయి.

ఇక తన ఫ్రెండ్ గా నటించిన సప్తగిరి తన మార్క్ కామెడీ తో ఆకట్టునే ప్రయత్నం చేసాడు. అలాగే పెర్ఫామెన్స్ పరంగా కోడోత్ మంచి నటన కనబరిచాడు. ఇక మిగతా నటులు పోసాని బిత్తిరి సత్తి లు కూడా తమ వరకు నవ్వించే ప్రయత్నం చేశారు. అలాగే సినిమాలో మ్యూజిక్ కొంచెం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో పెద్దగా కొత్త కథేమీ కనిపించదు పరమ రొటీన్ లైన్ నరేషన్ లు అయితే కనిపిస్తాయి దీనితో చాలా వరకు సినిమా బోర్ గానే అనిపిస్తుంది. అలాగే సినిమాలో చాలా మంది పాత్రలకి డిఫరెంట్ పేర్లు కామికల్ గా ఎదో ట్రై చేసారు కానీ అవేవి అంతగా వర్కవుట్ అవ్వవు.

ఆ నవ్వు తెప్పించని కామెడీ సీన్స్ సినిమా క్యాప్షన్ కి సంబంధం లేకుండా అనిపిస్తాయి. ఇంకా మెయిన్ గా సన్నీ సప్తగిరి లనే ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చినట్టే సినిమాలో మిగతా పత్రాలు హీరోయిన్ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది. ఆమెతో పాటుగా చాలా పాత్రలు సినిమాలో ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది.

అలాగే విలన్ కి హీరోలకి మధ్య మెయిన్ కాంఫ్లిక్ట్ పాయింట్ కూడా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే కాస్త కారణభూతంగా ఉండేది. ఇక వీటితో పాటుగా సినిమాలో ఆర్టిస్ట్ లు మాట్లాడే దానికి అలాగే మనకి వినిపించే మాటలు గాని ఎక్కడా సింక్ కూడా ఉండవు. ఆ రేంజ్ లో ఉంది ఈ సినిమా.

 

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. భీమ్స్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా ఎడిటింగ్ లో అయితే కొన్ని అనవసర సీన్స్ తీసేయాల్సింది. ఇక దర్శకుడు డైమండ్ రత్నబాబు ఆకట్టుకునే ఎంటర్టైనర్ చేయడంలో మెప్పించలేదు. ఈ సినిమాలో ఎక్కడో ఒకటి రెండు కొన్ని కామెడీ సీన్స్ మిన్నగా పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేసేలా తాను తీర్చి దిద్దలేదు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే కామెడీ ఎంటర్టైనర్ అంటూ వచ్చిన ఈ “అన్ స్టాప్పబుల్”. కామెడీ తక్కువ బోరింగ్ ట్రీట్మెంట్ తో ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. ఎక్కడో ఒకటి రెండు సీన్స్ తప్ప సినిమా అంతా బోర్ గానే ఉంటుంది. ఈ వారాంతంలో ఈ సినిమాకి స్కిప్ చేసేయడమే మంచిది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు