ఓటిటి సమీక్ష: “వివాహ భోజనంబు” – తెలుగు చిత్రం సోనీ లివ్ లో ప్రసారం

ఓటిటి సమీక్ష: “వివాహ భోజనంబు” – తెలుగు చిత్రం సోనీ లివ్ లో ప్రసారం

Published on Aug 28, 2021 3:02 AM IST
Vivaha Bhojanambu movie review

విడుదల తేదీ : ఆగస్టు 27, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సత్య, ఆర్జవీ రాజ్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, TNR, శివన్నారాయణ మరియు సందీప్ కిషన్
దర్శకుడు: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: కెఎస్ సినిష్ మరియు సందీప్ కిషన్
సంగీత దర్శకుడు: అనివీ
సినిమాటోగ్రఫీ: మణి కందన్
ఎడిటర్: చోటా కె ప్రసాద్


ప్రస్తుతం మేము కొనసాగుతున్న పలు డైరెక్ట్ స్ట్రీమింగ్ షోస్ మరియు సినిమాలు, సిరీస్ ల సమీక్షల పరంపరలో తాజాగా ఎంచుకున్న చిత్రం “వివాహ భోజనంబు”. కమెడియన్ టర్న్డ్ హీరో సత్య నటించిన ఈ చిత్రం ఈరోజే లేటెస్ట్ గానే స్ట్రీమింగ్ యాప్ సోనీ లివ్ లోకి అందుబాటులోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్ ని ఎంత మేర ఆకట్టుకుందో సమీక్షలో పరిశీలిద్దాం రండి.

కథ :

మహేష్(సత్య) హైదరాబాద్ లో ఒక చిన్నపాటి ఉదయిగం చేస్తూ తన లైఫ్ ని అలా సాగిస్తూ ఉంటాడు. అలాగే డబ్బువు విషయంలో చాలా చాలా పొదుపుగా ఉండే మహేష్ అనిత(ఆర్జవీ రాజ్) తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అవుతాడు. అయితే నిశ్చితార్ధనికే అయ్యే ఖర్చులకి భయపడే మహేష్ అలాంటిది పెళ్లి పనులకని వచ్చిన పెళ్లి కూతురి కుటుంబం ఊహించని రీతిలో కరోనా ఫస్ట్ లాక్ డౌన్ లో ఇరుక్కుంటే ఎలా ఉంటుంది? దాన్ని పొడిగించడం వల్ల మహేష్ పడే ఇబ్బందులు ఏమిటి? డబ్బులు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే మహేష్ వాళ్ళందరిని ఎలా డీల్ చేస్తాడు అన్నది తెలియాలి అంటే సోనీ లివ్ లో ఈ చిత్రాన్ని వీక్షించాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మెయిన్ స్టోరీనే హీరో సత్య చుట్టూతా తిరుగుతుంది.. దానికి అనుగుణంగానే సత్య కూడా తన నుంచి బెస్ట్ పెర్ఫామెన్స్ అందించాడని చెప్పాలి. ఇదివరకు తన కామికల్ టైమింగ్ తో మంచి ఫన్ రోల్స్ ని రక్తి కట్టించిన సత్య ఇందులో కూడా సెటిల్డ్ నటనను కనబరిచాడు.

పొదుపుగా డబ్బు వాడే లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తిగా తాను చూపిన హావభావాలు కామెడీ, ఎమోషన్స్ అన్నీ కూడా బాగుంటాయి. అలాగే హీరోయిన్ గా కనిపించిన ఆర్జవీ కూడా మంచి నటనను కనబరిచింది. పలు సన్నివేశాల్లో మంచి క్యూట్ నటన తన పాత్ర పరిధి మేరకు డీసెంట్ యాక్టింగ్ కనబరిచింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యంగర్ తనదైన శైలి నటన కనబరిచారు.

ఇంకా ఈయన సహా టి ఎన్ ఆర్ కనిపించడం బాగా అనిపిస్తుంది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల మేరకు బెస్ట్ ఇచ్చారు. అలాగే ఈ చిత్రంలో కనిపించే కాన్సెప్ట్ దానికి అనుగుణంగా వచ్చే పలు సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అలాగే సందీప్ కిషన్ ఈ చిత్రంలో కనిపించడం ఈ చిత్రంలో మరో అట్రాక్షన్ అని చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో డ్రా బ్యాక్ మాత్రం చాలానే అనిపిస్తాయి.. అసలు ఈ చిత్రంలో కనిపించే సెటప్ అంతా కూడా అంత నాచురల్ గా అనిపించదు. కొన్ని ఎంటర్టైనింగ్ సన్నివేశాలు మినహా ఈ చిత్రంలో కథనం అంతా చప్పగా ఉంటుంది. అలాగే కొన్ని సన్నివేశాలకు అసలు పొంతనే అనిపించదు.

సత్య రోల్ ని ఒకలా సినిమాలో చూపిస్తారు కానీ దానిని హీరోయిన్ కుటుంబీకులతో మాత్రం లాజిక్ లేకుండా ప్రెజెంట్ చెయ్యడం వింతగా అనిపిస్తుంది. అలాగే మెయిన్ లీడ్ మధ్య సన్నివేశాలు వారి లవ్ ట్రాక్ అంతా కూడా సినిమాటిక్ గా అసలు సంబంధమే లేకుండా ఏదో కావాలని పెట్టించినట్టు అనిపిస్తుంది.

వీటితో పాటుగా స్క్రీన్ ప్లే కూడా పెద్ద కొత్తగా ఏమి కనిపించదు. చాలా సన్నివేశాలు ఆల్రెడీ చూసినట్టే ఊహించినట్టే అనిపిస్తాయి.. ఇవన్నీ కూడా ఈ చిత్రంపై ఆసక్తిని ఖచ్చితంగా తగ్గించేస్తాయి.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో టెక్నీకల్ టీం సపోర్ట్ పర్లేదని చెప్పాలి. సంగీతం అలాగే సినిమాటోగ్రఫీ డీసెంట్ గా అనిపిస్తాయి అలాగే ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. అలాగే మేకర్స్ నిర్మాణ విలువలు సినిమాతగ్గట్టుగా ఓకే అని చెప్పొచ్చు.

ఇక దర్శకుడు రామ్ అబ్బరాజు విషయానికి వస్తే తన స్టోరీ సెలక్షన్ నిజంగా మంచి ఛాయిస్ అని చెప్పాలి. కానీ దానిని ఎంగేజింగ్ గా నడిపించడంలో స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా జాగ్రత్తలు వహించి ఉంటే బాగుండేది. చాలా వరుసకు తెలిసిన కథనంనే చూపించారు. అంతకు మించి థ్రిల్ చేసే కథనం కానీ ఎలిమెంట్స్ కానీ ఓవరాల్ గా ఇందులో కనిపించవు కొన్ని నవ్వించే సీన్స్ తప్ప.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “వివాహ భోజనంబు” లో సత్య ప్రామిసింగ్ పెర్ఫామెన్స్ అక్కడక్కడా నవ్వించే కొన్ని నవ్వులు మినహా గొప్పగా ఏమీ ఈ చిత్రంలో కనిపించదు. రొటీన్ స్క్రీన్ ప్లే, పొంతన లేని సన్నివేశాలు వీక్ డైరెక్షన్ వంటివి ఈ చిత్రాన్ని పెద్ద ఆసక్తికరంగా మలచవు. మరి వీటి అనుగుణంగా కేవలం కొంత ఎంటర్టైన్మెంట్ కోసం ఓసారి చూడాలనుకునే వారు చూడొచ్చు.

123telugu.com Rating :  2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు