సెన్సార్ విషయంలో ‘దీవానా’ టీం దారుణంగా డిజప్పాయింట్మెంట్!

సెన్సార్ విషయంలో ‘దీవానా’ టీం దారుణంగా డిజప్పాయింట్మెంట్!

Published on Jun 22, 2026 9:59 PM IST


లేటెస్ట్ గా టాలీవుడ్ దగ్గర రిలీజ్ అయ్యి సాలిడ్ మౌత్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమానే ‘దీవానా’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ ఆర్ హీరోగా యువ నటి స్మేహ మణిమేగలై హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా సూపర్ హిట్ దిశగా వెళుతుంది. అయితే ఈ సినిమా సక్సెస్ పరంగా మేకర్స్ పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరని క్లియర్ గా ఇప్పుడు అర్ధం అవుతుంది.

లేటెస్ట్ మీట్ లో మాట్లాడుతూ తమ సినిమాకి డెఫినెట్ గా సెన్సార్ సర్టిఫికెట్ వల్ల చాలా డ్యామేజ్ అయినట్టు చెబుతున్నారు. సినిమా చూసిన చాలా మంది సినిమా సినిమాలో ఏమంత ఉందని ఏ సర్టిఫికెట్ ఇచ్చారని అంటున్నారని దీని వల్ల పది మందిలో కేవలం కొంతమంది మాత్రమే థియేటర్స్ కి వస్తున్నారని అలాగే కొందరు పెద్దలు కూడా ఆగిపోతున్నారని కేవలం ఈ సర్టిఫికెట్ మూలాన వసూళ్ల పరంగా నష్టం చూడాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో కూడా వీరికి సపోర్ట్ దక్కుతుంది. సో మళ్లీ రీ సెన్సార్ లాంటివి ఉంటాయా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు