నయన్ ‘కోకిల’ ను పట్టించుకుంటారా ?

నయన్ ‘కోకిల’ ను పట్టించుకుంటారా ?

Published on Jul 29, 2018 11:23 PM IST

కథాబలం కలిగిన సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి నయన తార. ప్రస్తుతం తమిళ భాషలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కొలమావు కోకిల'(కోకో). నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నయన్ డ్రగ్స్ అమ్మే యువతి పాత్రలో నటిస్తుంది. వైవిధ్యమైన కథాంశముతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో విడుదల చేస్తున్నారు. నయన్ నటించే సినిమాలకు ఇక్కడ కూడా మార్కెట్ ఉండడంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సొంతంగా తెలుగులో విడుదలచేస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని ఇక్కడి ప్రేక్షకులు పట్టించుకుంటారో లేదో చూడాలి.

అనిరుద్ సంగీతం అందిస్తున్నా ఈ చిత్రం లోని వీడియో సాంగ్ ఇటీవల విడుదలైన రికార్డు వ్యూస్ ను సొంతం చేసుకుంది. యోగిబాబు , శరణ్య తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 17న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు