చిట్ చాట్ : లావణ్య త్రిపతి – తెలుగమ్మాయిలు చాలా అందంగా ఉంటారు.

చిట్ చాట్ : లావణ్య త్రిపతి – తెలుగమ్మాయిలు చాలా అందంగా ఉంటారు.

Published on Oct 1, 2013 2:00 PM IST

Lavanya

మొదటి సినిమా ‘అందాల రాక్షసి’ అనుకున్నంత విజయాన్ని ఇవ్వకపోయినా లావణ్య త్రిపతి తన నటన, లుక్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తనకి అందాల రాక్షసి లావణ్య నే పేరుని తెచ్చి పెట్టింది. లావణ్య తన రెండవ ప్రయత్నంగా మంచు విష్ణు సరసన ‘దూసుకెళ్తా’ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా లావణ్య కాసేపు కొంతమంది మీడియా వారితో ముచ్చటించింది. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘దూసుకెళ్తా’ లో మీ పాత్ర గురించి ఏమి చెప్తారు?

స) ‘దూసుకెళ్తా’ సినిమాలో నేను అలేఖ్య అనే పాత్ర పోషించాను. చాలా స్వీట్ గా ఉంటూనే, కాస్త అణకువ ఉన్న అమ్మాయి. కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎవరిమీద ఆధారపడదు. అలాగే ఎదుటి వారిపట్ల ఎంతో కేరింగ్ గా ఉంటుంది.

ప్రశ్న) మరి విష్ణు పాత్ర గురించి చెప్పండి?

స) సినిమాలో నేను విష్ణుని చిన్న అని పిలుస్తుంటాను. మామూలుగా సినిమాలో విష్ణు చాలా స్మార్ట్ అండ్ టాలెంటెడ్ కుర్రాడు. ఎలాంటి సమస్య చెప్పినా తన దగ్గర ఓ సమాధానం ఉంటుంది. అలాగే ఈ సినిమాలో మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. దానికన్నా మించి ఏమన్నా చెప్పాలి అంటే ఈ ప్రశ్నని మీరు విష్ణుని అడిగితే బాగుంటుంది(నవ్వుతూ).

ప్రశ్న) మీ రెండవ సినిమా ఒక మాస్ ఎంటర్టైనర్. దాన్ని ఎలా డీల్ చెయ్యగలిగారు?

స) చెప్పాలంటే నేను చాలా మంది టాలెంట్ ఉన్న ఒక కంపెనీలో పనిచేసాను, వాళ్ళు నాకు హెల్ప్ చేసారు, దాంతో ఈజీగా చెయ్యగలిగాను. నా మొదటి సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో నా పాత్ర కాస్త గ్లామరస్ గా ఉంటుంది. అలాగే ఈ పాత్రలో బాగా పరిణతి చెందిన అమ్మాయిలా కనిపిస్తాను. అందరూ నేను కేవలం ఆర్ట్ సినిమాల్లో మాత్రమే నటించగలనని అనుకుంటున్నారు, అది తప్పు అని నేను నిరూపించుకోవాలి(నవ్వుతూ).

ప్రశ్న) మీరు కథలని ఎలా ఎంచుకుంటారు?

స) ముందుగా నేను కథకి కనెక్ట్ అవ్వాలి. అలాగే నా పాత్రకి కథలో కాస్త ప్రాముఖ్యత ఉండాలి. నేను ఇవే మొదటగా చూస్తాను. కమర్షియల్ అంశాలు, మొదలైన వాటి గురించి పెద్దగా ఇబ్బందిపడను. అలాగే నేను డిఫరెంట్ పాత్రలు ట్రై చెయ్యాలనుకుంటున్నాను, ఎప్పుడూ ఒకే ఇమేజ్ కి పరిమితమవ్వకూడదని అనుకుంటున్నాను.

ప్రశ్న) సినిమా చూస్తుంటే కామెడీ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది. కామెడీ సీక్వెన్స్ లో నటించడం కష్టమా?

స) (ఆలోచిస్తే) కామెడీ అంత టఫ్ కాదు. సినిమాలో కామెడీ సీక్వెన్స్ లు చాలా నాచురల్ గా అనిపిస్తాయి. ఎందుకంటే సినిమాలో అంతా సన్నివేశానికి తగ్గ కామెడీ ఉంటుందే తప్ప కామెడీ కోసం క్రియేట్ చేసిన సీన్స్, ఆర్టిఫిషియల్ కామెడీ ఉండదు. కామెడీ పరంగా ఈ సినిమాలో బ్రహ్మానందం గారితో పనిచెయ్యడం మంచి అనుభవం.

ప్రశ్న) విష్ణు గురించి చెప్పమంటే ఏం చెప్తారు?

స) విష్ణు చాలా మంచి కో స్టార్ మరియు నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. అతను అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఎప్పుడు నన్ను తక్కువ చేసి చూడలేదు. సెట్ లో అయితే ఎంతో సరదాగా ఉంటాడు. అతనితో పనిచెయ్యడం చాలా ఆనందంగా ఉంది. అలాగే విష్ణు కుమార్తెలు అరి – వివి ఏంజల్స్ అని చెప్పాలి. ఎప్పుడైతే వారిద్దరూ సెట్స్ కి వస్తారో అప్పుడు నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేది.

ప్రశ్న) వీరు పోట్ల ఒక కమర్షియల్ డైరెక్టర్. అతని వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి?

స) వీరు పోట్ల చాలా మంచి వ్యక్తి. ప్రతిది నాకు అర్థం అయ్యేలా చెప్పేవారు. చాలా మంచి డైరెక్టర్, అతని దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను.

ప్రశ్న) మీకు డాన్స్ అంటే చాలా ఇష్టం. మీ డాన్సింగ్ స్కిల్స్ ని చూపించే అవకాశం ఈ సినిమాలో వచ్చిందా?

స) అవును(నవ్వుతూ).. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఈ సినిమాతో నా డాన్సింగ్ స్కిల్స్ ని నిరూపించుకోవాలనుకున్నాను. కానీ మొదట్లో మాస్ సాంగ్స్ అనగానే కాస్త ఆందోళన పడ్డాను, ఎందుకంటే నాకు ఇండియన్ క్లాసికల్ అంటే ఇష్టం. కానీ చాలా బాగా చేసాను. ప్రేమ రక్షిత్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేసారు.

ప్రశ్న) చాలా మంది మీరు తెలుగమ్మాయి అనుకుంటున్నారు. ఆ విషయంలో ఎలా ఫీలవుతున్నారు?

స) ఆ ఫీల్ చాలా బాగుంది. చాలా మంది నా పేరు లావణ్య త్రిపతి అయితే లావణ్య తిరుపతి అనుకుంటున్నారు. కానీ ఆ ఫీల్ బాగుంది. తెలుగు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, అందుకే ఈ కాంప్లిమెంట్ ఇచ్చారనుకుంటా. నాకు భాషతో ఎలాంటి ఇబ్బంది లేదు, నా డైలాగ్స్ ని చదివి నేను అర్థం చేసుకోగలను.

ప్రశ్న) మీ పరంగా ‘దూసుకెళ్తా’ సినిమాలో హైలైట్స్ ఏమిటి?

స) ‘దూసుకెళ్తా’ సినిమా పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, రొమాన్స్ మరియు సెంటిమెంట్ ఇలా అన్నీ ఉంటాయి. సినిమాకి వచ్చిన ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారు, ఆ నమ్మకం నాకుంది.

అంతటితో లావణ్యతో మా ఇంటర్వ్యూని ముగించాం. ఆమె త్వరలోనే ఓ తమిళ సినిమా కోసం యూరప్ పయనం కానుంది. లావణ్య నటించిన రెండవ సినిమా ‘దూసుకెళ్తా’ మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు