ఇంటర్వ్యూ : నేను రీమేక్ సినిమాలు అస్సలు చేయను – మహేష్ బాబు

ఇంటర్వ్యూ : నేను రీమేక్ సినిమాలు అస్సలు చేయను – మహేష్ బాబు

Published on Feb 3, 2013 7:16 PM IST

mahesh-babu

దూకుడు, బిజినెస్ మేన్ ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలతో వరుసగా మూడు సూపర్ హిట్లు కొట్టి జోరు మీదున్న మహేష్ బాబు సుకుమార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సక్సెస్ సందర్భంగా మీడియా మిత్రులతో కలిసి ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ చిత్రం 64 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్ర అనుభవాలు తరువాత చేయబోయే ప్రాజెక్ట్ వివరాలు మహేష్ మాటల్లో …

ప్ర : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ విజయాన్ని ముందే ఊహించారా?
స : చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమా బ్లాక్ బస్టర్ అయినపుడు చాలా ఆనందంగా ఉంటుంది. వెంకటేష్ గారు నేను కలిసి ఎలాంటి ఈగోలు లేకుండా చేసాం. ఎంత పెద్ద రేంజ్ అనేది ముందు అనుకోలేదు. కష్టపడి చేద్దాం, సక్సెస్ అదే వస్తుంది అని నమ్మాను.

ప్ర : మళ్లీ ఏమైనా మల్టీ స్టారర్ సినిమా అవకాశం ఉందా?
స : ప్రస్తుతం ఏమి ఉండదు. భవిష్యత్తులో శ్రీకాంత్ లాగా ఎవరైనా మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తా.

ప్ర : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత మీలో ఏమైనా మార్పు వచ్చిందా?
స : నాలో మార్పు ఎప్పుడో వచ్చింది, ఈ సినిమాతో కొత్తగా నాలో మార్పు అని ఏమీ లేదండి.

ప్ర : మహేష్ బాబు లేకపోతే ఈ సినిమాకి ఇంత హైప్ వచ్చేది కాదని కొంత మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. దానికి మీ రియాక్షన్ ఏంటి?
స : అది కరెక్ట్ కాదు (నవ్వుతూ).

ప్ర: మీ అబ్బాయి గౌతమ్ ఈ సినిమా ఆడియో లాంచ్ చేసాడు. సినిమా చూసాడని కూడా చెప్పారు. సినిమా చూసాక నేను కూడా యాక్ట్ చేస్తా అని అన్నాడా?
స : గౌతమ్ నాతో కలిసి మొత్తం సినిమా చూసింది ఇదొక్కటే. వాడికి ఫైట్స్ అవి అస్సలు నచ్చవు. ఇంతకు ముందు సినిమాలన్నీ అందుకే చూడలేకపోయాడు. ఈ సినిమా చూస్తూ యాక్ట్ చేస్తా అనలేదు కానీ బాగా ఎగ్జైట్ అయ్యాడు. నాన్నగారు చిన్నప్పుడు నన్నెప్పుడు యాక్ట్ చేయమని అడగలేదు. నాకు నేనుగా చేయాలనిపించి చేశాను. అలాగే గౌతమ్ కూడా. తనకి చేయలనిపించినపుడు చేస్తాడు.

ప్ర : ఒక డైరెక్టర్ వచ్చి మీకు కథ చెప్పినపుడు మీరు కథ నచ్చి ఒకే చేస్తారా లేక మీ క్యారెక్టరైజేషణ్ నచ్చి ఓకే చేస్తారా?
స : ఈ రోజుల్లో కథలు దొరకడం చాలా కష్టంగా ఉంది. లక్కీగా దూకుడు తరువాత మూడు మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఎవరైనా కథ చెప్పినపుడు నేను ఎగ్జైట్ అయితే చేస్తాను అని చెప్పేస్తాను. ఈ క్యారెక్టరైజేషణ్ ఆ క్యారెక్టరైజేషణ్ అంటూ ఏమీ ఉండదు.

ప్ర : త్రిష తరువాత మీ సినిమాల్లో రిపీట్ అయిన హీరోయిన్ సమంత. దూకుడులో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది అని మళ్లీ చేసారా?
స : నాకు హీరోయిన్స్ అంటే సిగ్గు, మొహమాటం ఎక్కువ. ఆల్రెడీ చేసిన హీరోయిన్ అయితే కొంచెం కంఫర్ట్ ఎక్కువగా ఉంటుంది అంతే.

ప్ర : మీ సినిమాలు ఒకదానిని మించి మరొకటి ఓవర్సీస్ లో పెద్ద హిట్స్ అవుతున్నాయి. వారి కోసం స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుని చేస్తున్నారా?
స : ఓవర్సీస్ లో నా ప్రతి సినిమా బాగా ఆడుతుంది. ఖలేజా లాంటి సినిమాకి కూడా అక్కడ పెద్ద షేర్స్ వచ్చాయి. వాళ్ళకి స్పెషల్ థాంక్స్ చెప్పుకోవాలి. దూకుడు అయితే మర్చిపోలేని హిట్ ఇచ్చారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా ఆల్మోస్ట్ దూకుడుని దాటి కలెక్షన్స్ వచ్చాయి అన్నారు.

ప్ర : మీ నాన్నగారి సినిమా ఒకటి మీరు రిమేక్ చేస్తున్నారని ఆ మధ్య కొన్ని వార్తలొచ్చాయి. ఆ ఆలోచన ఏమైనా ఉందా?
స : నేను ఏ రీమేక్ లు చేయను. సినిమా అనేది క్రియేటివిటీ అని నేను ఫీలవుతాను. సెట్ కి వెళ్ళేటపుడు కొత్తగా ఏదో చేస్తున్నాం అని ఉండాలి కానీ ఆల్రెడీ చేసిన దాన్ని మల్లి చేస్తే అందులో ఎగ్జైట్మెంట్ ఉండదు. షూటింగ్ బోర్ కొడుతుంది. అలా బోర్ కొట్టిందంటే నేను చేయలేను. అందుకే నేను రీమేక్ సినిమాలకి పూర్తి వ్యతిరేకిని. పాత సినిమాలు కానీ, పక్క భాష సినిమాలు కానీ ఏవి రీమేక్ చేయను.

ప్ర : మీరు రీమేక్ సినిమాలకి వ్యతిరేకి అన్నారు. మీ సినిమాలు ఎవరైనా రీమేక్ చేస్తే ఎలా ఫీలవుతారు.?
స : చాలా హ్యాపీగా ఫీలవుతాను (నవ్వుతూ).

ప్ర : తెలుగు సినిమా స్థాయిని మహేష్ బాబు పెంచారు అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే మీరెలా తీసుకుంటారు?
స : నేను పెంచడం కాదండి. నాకు లక్కీగా మంచి సినిమాలు పడటం నా డైరెక్టర్స్ వల్ల కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమాలు పడటం వల్ల ఇలా ఉంది. ప్రతి బ్లాక్ బస్టర్ తరువాత రేంజ్ మారిపోతూ ఉంటుంది. పోకిరి, మగధీర, దూకుడు ఇలా ప్రతి బ్లాక్ బస్టర్ తరువాత రేంజ్ మారుతూనే ఉంటుంది.

ప్ర : సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా ఎలా ఉండబోతుంది? ఆయన గత సినిమాల్లో గమనిస్తే హీరో పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో మీ పాత్ర కూడా అలాగే ఉంటుందా?
స : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరువాత చేస్తున్న సుకుమార్ సినిమా టోటల్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన గత సినిమాల కంటే ఇందులో హీరో క్యారెక్టరైజేషణ్ చాలా కొత్తగా ఉంటుంది.

ప్ర : ఈ సినిమాకి ఆచార్య అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. టైటిల్ అదేనా?
స : ఇంకా టైటిల్ ఫైనల్ కాలేదు. ఫైనల్ అయ్యాక నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాం.

ప్ర : ఇంతకు ముందు తెలుగు స్టార్స్ యాడ్స్ ఎక్కువగా చేసేవారు కాదు. మీరు దానిని నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్ళారు. దానికి మీరెలా ఫీలవుతున్నారు?
స : నేను ఫస్ట్ థమ్సప్ యాడ్ చేశాను. ఆ తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నపుడు రెండు, మూడు యాడ్స్ చేశాను. ఆ టైంలో గమనించింది ఏంటంటే నేను సినిమాలు చేయకపోయినా జనాలు నన్ను గుర్తు పెట్టుకున్నారు. ఆ టైంలోనే ఆయా కంపెనీ బ్రాండ్ వాళ్ళు సర్వే చేసాం, అందరు హీరోలని సర్వే చేసాం, మిగతా వాళ్ళకంటే నా పర్సంటేజ్ ఎక్కువగా ఉండటం చూసాను. సినిమాలు రిలీజ్ అవకపోయినా ఆడియెన్స్ నుండి ఇంత సపోర్ట్ ఉన్నందుకు చాల హ్యాపీగా ఫీలయ్యాను. అది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

ప్ర : చిరంజీవి గారి తరువాత మీరే నెంబర్ వన్ అని ఎంత మంది అన్న మీరు ఒప్పుకోరా?
స : మంచి సినిమాలు చేయాలి అంతే తప్ప ఈ నెంబర్ వన్ ఇవన్ని నేను పెద్దగా పట్టించుకోను. నేను నెంబర్ వన్ అని యాక్సెప్ట్ చేయను మీరే యాక్సెప్ట్ చేయాలి (నవ్వుతూ).

ప్ర : నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్?
స : సుకుమార్, శ్రీను వైట్ల సినిమాలు కాకుండా ఇంకా మూడు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. వంశి పైడిపల్లి, క్రిష్, పూరి జగన్నాధ్ సినిమాలు ఒప్పుకున్నాను.

ప్ర : చివరిగా ‘రాజమౌళి గారితో సినిమా ఎప్పుడు ఉంటుంది’?
స : రాజమౌళి గారితో మీటింగ్ అయింది. ఇద్దరం చేయాలని చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. ఇటు నా ప్రాజెక్ట్, అటు ఆయన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక కచ్చితంగా చేస్తాం.

మహేష్ సక్సెస్ గ్రాఫ్ ఇలాగె కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం.

అశోక్ రెడ్డి

Click Here For English Interview

సంబంధిత సమాచారం

తాజా వార్తలు