రెండవ హీరోయిన్ ను ఫైనల్ చేసుకున్న ఎన్టీఆర్ !


గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జై లవ కుశ’ లో రెండవ హీరోయిన్ గా నటించబోయేది ఎవరనే విషయంపై తీవ్ర సందిగ్దత నెలకొంది. చాలా మంది హీరోయిన్ల పేరు వినిపించాయి కూడా. వీటన్నింటికీ ఫులుస్టాప్ పెడుతూ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఆ హీరోయిన్ ఎవరనేది ప్రటించేసింది. ఆమె మరెవరో కాదు నివేత థామస్.

గత సంవత్సరం నాని నటించిన ‘జెంటిల్మెన్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె ఆ చిత్రంలో నానితో పోటీగా నటించి ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకుంది. అంతేగాక నాని సరసన ‘నిన్ను కోరి’ అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. ఇకపోతే జై లవ కుశ లో ఎన్టీఆర్ సరసన మొదటి హీరోయిన్ గా రాశి ఖన్నాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మొదటిసారి మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సీకే మురళీధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో రిలీజ్ చేసేలా ప్రణాళికను సిద్ధం చేశారు.

 

Like us on Facebook