కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి, కొరటాల శివ, రాజమౌళి వైరల్ కామెంట్స్!

కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి, కొరటాల శివ, రాజమౌళి వైరల్ కామెంట్స్!

Published on May 2, 2024 3:01 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వివి గోపాల కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా కృష్ణమ్మ మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని, కొరటాల శివ, రాజమౌళి లు చీఫ్ గెస్ట్ లుగా హాజరు అయ్యారు.

ఈ వేడుక లో దేవర మరియు రాజమౌళి – మహేష్ చిత్రాల గురించి వెల్లడించాలని అనిల్ రావిపూడి కోరారు. అందుకు కొరటాల శివ రెస్పాండ్ అయ్యారు. దేవర అప్డేట్స్ త్వరలో వస్తాయి. రిలీజ్ డేట్ అక్టోబర్ 10 అని చెప్పాం కదా అని అన్నారు. అయితే రాజమౌళి మాత్రం సినిమా గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అనిల్ రావిపూడి వెనకాలే కెమెరా పట్టుకొని నడుస్తూ, ఎవరైనా మూసుగేసి గుద్దేస్తే 10 వేలు ఇస్తా అంటూ పంచులు వేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు