‘శ్రీమంతుడు’పై స్పందించిన నటకిరీటి

‘శ్రీమంతుడు’పై స్పందించిన నటకిరీటి

Published on Aug 2, 2015 5:13 PM IST

rajendra-prasad

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. ఓ సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్ ని పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పడానికి ట్రై చేసిన ఈ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు స్టార్ యాక్టర్స్ అయిన జగపతి బాబు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రలు పోషించారు.
గత కొద్ది రోజులుగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన వారి కొన్ని వీడియో బైట్స్ ని రిలీజ్ చేస్తున్నారు.

‘శ్రీమంతుడు సినిమాలో నేను వర్క్ చెయ్యడం అద్భుతమైన అనుభవం. ఈ సినిమాలో మన పల్లెటూరి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు తెలియజేస్తారు. అలాగే ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకునేలా ఉంటుందని’ రాజేంద్ర ప్రసాద్ తెలిపాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ కూడా వినిపిస్తోంది. ఈ రోజు సాయంత్రం కల్లా ఈ సినిమా ఫస్ట్ కాపీని సిద్దం చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు