రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్ చేస్తున్న అల్లు అర్జున్.

రామోజీ ఫిల్మ్ సిటీలో ఫైట్ చేస్తున్న అల్లు అర్జున్.

Published on Oct 30, 2014 1:25 PM IST

allu-arjun
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ మరికొందరు ఫైటర్లు షూటింగ్ లో పాల్గొంటున్నారు. బన్ని స్టైల్ కి తగట్టు పీటర్ హెయిన్స్ ఫైట్ డిజైన్ చేశారని సమాచారం.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సమంత, అదా శర్మ, నిత్యా మీనన్.. ముగ్గురూ బన్నితో తొలిసారి నటిస్తుండడం విశేషం. సీనియర్ హీరోయిన్ స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ‘జులాయి’ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు