సాంగ్ ప్రోమోతో ఆకట్టుకుంటున్న ‘అశ్వథ్థామ’ !

సాంగ్ ప్రోమోతో ఆకట్టుకుంటున్న ‘అశ్వథ్థామ’ !

Published on Dec 15, 2019 11:22 AM IST

యూత్ హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా ‘అశ్వథ్థామ’ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ వీడియో సాంగ్ ప్రోమో ‘నిన్నే నిన్నే’ రిలీజ్ అయింది. శ్రీ చరణ్ పాకల అందించిన క్లాసిక్ ట్యూన్ కి రమేష్ వకాచర్ల భావాత్మకమైన పదాలతో చక్కని సాహిత్యాన్ని అందించారు. అలాగే ఈ పాటను ఆలపించిన అర్మాన్ మాలిక్ వాయిస్ కూడా సాంగ్ ను మరో స్థాయిలో నిలబెట్టింది. మొత్తానికి ఈ చిన్న ప్రోమోనే.. సాంగ్ ఎలా ఉండబోతుందో చెప్పింది.

కాగా శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో రానున్న ఈ సినిమాతో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 31న ఈ మూవీ విడుదల కానుంది. ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ కూడా ఉంటుందట. పోసాని కృష్ణ‌ముర‌ళీ, స‌త్య‌, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి శ్రీ‌చ‌ర‌ణ్‌ సంగీతం అందిస్తుండగా, కెమెరామెన్ గా మ‌నోజ్‌ రెడ్డి, అలాగే ఎడిట‌ర్‌ గా గారీ బిహెచ్‌ పని చేస్తున్నారు.

సాంగ్ ప్రోమో కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు