యాభై రోజుల ప్రభంజనం.. ‘బాహుబలి’!

యాభై రోజుల ప్రభంజనం.. ‘బాహుబలి’!

Published on Aug 28, 2015 1:33 AM IST

Baahubali
ఇండియన్ సినిమా అంటే ఒక్క హిందీ సినిమా మాత్రమే అన్న అభిప్రాయాలున్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ సినిమా దేశవ్యాప్తంగా ఓ ప్రభంజనం సృష్టించి చరిత్రకెక్కింది. ఆ సినిమాయే దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి’. ప్రపంచవ్యాప్తంగా జూలై 10న విడుదలైన ఈ సినిమా ట్రేడ్ పండితుల ఊహకు కూడా అందని రీతిలో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి నేటితో యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాక తమిళం, మళయాలం, హిందీ ఇలా విడుదలైన అన్నిచోట్లా ఈ సినిమా రికార్డుల మోత మోగించింది.

ఇండియన్ మార్కెట్లో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి టాప్ స్టార్స్‌ సినిమాలను సైతం పక్కనపెట్టేసి ‘బాహుబలి’ సినిమా బాక్సాఫీస్ వద్ద నెంబర్ వన్ స్థానంలో నిలబడడం ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా అనే అభిప్రాయాన్ని తుడిచేసింది. రాజమౌళి విజన్, ప్రభాస్, రానాల యాక్టింగ్, ఇలాంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించేందుకు సాహసం చేసిన ఆర్కా మీడియా వర్క్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. అన్నీ కలిసి ‘బాహుబలి’ని అంతర్జాతీయ సినిమాగా నిలబెట్టాయ్.

పలు అంతర్జాతీయ పత్రికలను సైతం ఆశ్చర్యపరచిన ‘బాహుబలి’, ఇంటర్నేషనల్ వర్షన్ రిలీజ్ అయ్యాక మరింత క్రేజ్ తెచ్చుకుంటుందనడంలో సందేహం లేదు. ఇక బాహుబలి పార్ట్ 1యే ఈ స్థాయి ప్రభంజనం సృష్టిస్తే వచ్చే ఏడాది రానున్న ‘బాహుబలి’ పార్ట్ 2 ఇంకెంత ప్రభంజనం సృష్టిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు