‘కబాలి’ రికార్డుల్ని బద్దలుకొట్టిన ‘బాహుబలి – ది కన్ క్లూజన్ ‘ !
Published on Jul 29, 2016 9:13 am IST

baahubali-kabali
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్టామినాను చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి – ది బిగినింగ్ (పార్ట్ – 1)’. దర్శక ధీరుడు ‘ఎస్.ఎస్. రాజమౌళి’ తెరకెక్కించిన ఈ అద్భుతం ఇప్పటికే పలు సరికొత్త రికార్డుల్ని సృష్టించింది. అయితే కొన్నిరోజుల క్రితం విడుదలైన ‘రజనీకాంత్’ కబాలి చిత్రం బాహుబలి రికార్డులు కొన్నింటిని తుడిచిపెట్టేసింది. వాటిలో ఇతర రాష్ట్రాలకు అమ్ముడైన మూవీ రైట్స్ తాలూకు రికార్డులు కూడా ఉన్నాయి.

కబాలి కేరళ రైట్స్ గత ‘బాహుబలి – ది బిగినింగ్(పార్ట్ 1)’ రికార్డుల్ని తిరగరాస్తూ రూ.7. 5 కోట్లకు అమ్ముడయ్యాయి. మళ్ళీ ఇప్పుడు తాజాగా ‘బాహుబలి – ది కన్ క్లూజన్(పార్ట్ – 2)’ కేరళ హక్కులు కబాలి రికార్డుల్ని బద్దలు కొడుతూ రూ.10.5 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. బాహుబలి మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ సాధించడంతో దీని సీక్వెల్ బాహుబలి – ది కన్ క్లూజన్(పార్ట్ – 2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

 

Like us on Facebook