విడుదలకు ముందే ‘బాహుబలి’ ఆడియో ట్రెండింగ్!

విడుదలకు ముందే ‘బాహుబలి’ ఆడియో ట్రెండింగ్!

Published on May 27, 2015 6:01 PM IST

baahubali-audio

‘బాహుబలి’ సినిమాకు ఏ స్థాయి క్రేజ్ ఉందనేది అభిమానులు మరోసారి ఋజువు చేసి చూపారు. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి మొదటి భాగానికి సంబంధించిన ఆడియో రిలీజ్ ఈ నెల 31న హైద్రాబాద్‌లో హైటెక్స్ గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాతే బాహుబలి ఆడియో సీడీలు మార్కెట్లో విడుదలవుతాయి. కాగా ఆడియో రిలీజ్ కంటే ముందే సీడీలను ఆర్డర్ పెట్టుకోమని అమేజాన్ ఆన్‌లైన్ పోర్టల్ ఆడియో సీడీలను పెట్టింది.

ఈ ఆడియో సీడీలకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ప్రీ ఆర్డర్‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయని టాక్. అమేజాన్ సైట్లో టాప్ సెల్లింగ్ లిస్ట్‌లో బాహుబలి ఆడియో సిడీ టాప్‌లో ఉండడం విశేషం. ఆడియో సీడీలకు కాలం చెల్లిందనుకుంటున్న ఈ కాలంలో లహరి మ్యూజిక్ బాహుబలి హక్కులను 3 కోట్ల రూపాయలకు కొనుక్కోవడం ఓ విశేషం కాగా, రిలీజ్‌కు ముందే ఆడియో సీడీలు ఈ స్థాయిలో అమ్ముడుపోవడం మరో విశేషం. మరి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు ఈ అంచనాలను అందుకుంటాయా అన్నది వేచిచూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు