ప్రారంభోత్సవానికి సిద్దమైన బాలక్రిష్ణ, బోయపాటిల సినిమా !

ప్రారంభోత్సవానికి సిద్దమైన బాలక్రిష్ణ, బోయపాటిల సినిమా !

Published on May 23, 2018 4:15 PM IST

టాలీవుడ్ లోని క్రేజీ కాంబినేషన్లలో బోయపాటి శ్రీను, నందమూరి బాలక్రిష్ణల కాంబో కూడ ఒకటి. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా హిట్ ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. గరంలో వీరు కలిసి చేసిన ‘సింహ, లెజెండ్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలుగా నిలవగా ఇప్పుడు మూడవ సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నారట.

‘ఎన్టీఆర్’ బయోపిక్ నిలిచిపోవడంతో తర్వాతి సినిమాపై దృష్టి పెట్టిన బాలక్రిష్ణ జూన్ రెండవ వారంలో బోయపాటి శ్రీను సినిమాను ప్రారంబిస్తారని వినికిడి. అంతకంటే ముందు ఈ నెలాఖరున వినాయక్ తో ఒక సినిమాను లాంచ్ చేయనున్నారు నట సింహం. అయితే ఈ వార్తలపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఇకపోతే బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు