అనుష్క సినిమా ఔట్ ఫుట్ చాలా బాగుందట !

అనుష్క సినిమా ఔట్ ఫుట్ చాలా బాగుందట !

Published on Oct 18, 2017 12:40 PM IST


లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘భాగమతి’ చిత్రం ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. చాన్నాళ్ల క్రితమే మొదలైన ఈ ప్రాజెక్ట్ మధ్యలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో కాస్త ఆలస్యమైనా ఔట్ ఫుట్ మాత్రం చాలా బాగా వస్తోందని టాక్. చిత్ర యూనిట్ మొత్తం రిజల్ట్స్ చూసి చాలా సంతృప్తిగా ఉన్నారట. ముఖ్యంగా అనుష్క మేకోవర్ ఊహించడానికంటే గొప్పగా వచ్చిందని అనుకుంటున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా ఉండనున్నాయి. అందుకేచిత్ర టీమ్ వీటిపై ప్రత్యేక శ్రద్ద పెట్టి వర్క్ చేస్తున్నారు. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ లు కూడా పలు కీలక పాత్రలు చేస్తున్నారు. `

సంబంధిత సమాచారం

తాజా వార్తలు