రెండున్నర మిలియన్లను అందుకున్న భరత్ !

రెండున్నర మిలియన్లను అందుకున్న భరత్ !

Published on Apr 24, 2018 8:30 AM IST

మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. మొదటిరోజే దాదాపు ఒకటిన్నర మిలియన్లను అందుకున్న ఈ సినిమా ఆదివారం నాటికి 2.48 మిలియన్ డాలర్లను, సోమవారం దాదాపుగా లక్ష డాలర్లను రాబట్టి మొత్తంగా 2.5 మిలియన్లను క్రాస్ చేసింది. బాహుబలి 1, 2 తర్వాత అంత వేగంగా 2.5 మిలియన్ ను అందుకున్న 3వ చిత్రంగా ‘భరత్ అనే నేను’ నిలిచింది.

అంతేగాక ఆల్ టైమ్ బెస్ట్ గ్రాసర్లలో బాహుబలి-1, 2, రంగస్థలం, శ్రీమంతుడు వంటి చిత్రాల తర్వాతి స్థానంలో ఉన్న ఈ పొలిటికల్ డ్రామా త్వరలోనే 4వ స్థానాన్ని ఆక్రమించనుంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందటంతో మొదటి నుండి భారీ అంచనాల్ని క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు