‘రజనీకాంత్’ కు ‘భారత రత్న’ ఇవ్వాలని డిమాండ్ !

‘రజనీకాంత్’ కు ‘భారత రత్న’ ఇవ్వాలని డిమాండ్ !

Published on Jul 28, 2016 5:54 PM IST

Rajinikanth
సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవార్ ‘రజనీకాంత్’ ఈ మధ్య కాలంలో మొదటిసారి ‘కబాలి’ సినిమా మూలాన కాకుండా మరో ముఖ్య కారణం మీద వార్తల్లో హైలెట్ అవుతున్నారు. అదేమంటే మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే ‘అనిల్ గోటే’ రజనీకాంత్ భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకుగాను ఆయన్ను దేశపు అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో సత్కరించాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.

దీనితో పాటు రజనీ మహారాష్ట్రలో పుట్టడం వల్ల ఆ ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన ‘మహారాష్ట్ర భూషణ్’ ను కూడా ఆయనకు ప్రధానం చెయ్యాలని, అసెంబ్లీ కూడా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చెయ్యాలని కోరారు. అలాగే రజనీని ‘సన్ ఆఫ్ సాయిల్’ గా అభివర్ణిస్తూ పరిశ్రమలో రజనీ దేవుడిలాంటి వాడని, అందుకు తాజాగా విడుదలైన కబాలి రికార్డులే సాక్ష్యమని కూడా అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు