మరో కొద్ది సేపట్లో నితిన్ ‘చిన్నదాన నీకోసం’ టీజర్

మరో కొద్ది సేపట్లో నితిన్ ‘చిన్నదాన నీకోసం’ టీజర్

Published on Oct 22, 2014 3:22 PM IST

Chinnadana-Neekosam

వరుస హిట్స్ తో ఫుల్ జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ‘చిన్నదాన నీ కోసం’ సినిమా షూటింగ్ ని ని దాదాపు ఫినిష్ చేసాడు. ఈ సినిమాలో మిగిలి ఉన్న బాలన్స్ పార్ట్ ని ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. దీపావళి కానుకగా ఈ రోజు ‘చిన్నదాన నీకోసం’ పోస్టర్స్ ని రిలీజ్ చేసాడు. ఇందులో హీరోయిన్ మిస్తిని రివీల్ చేస్తూ వచ్చిన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

కేవలం పోస్టర్స్ మాత్రమే కాకుండా ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ‘చిన్నదాన నీకోసం’ ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను నవంబర్ లో పూర్తి చేసి డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు