ధృవ్ మళ్లీ అలాంటి క్యారెక్టరే చేస్తున్నాడా ?

ధృవ్ మళ్లీ అలాంటి క్యారెక్టరే చేస్తున్నాడా ?

Published on Feb 23, 2020 7:56 PM IST

హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ‘ఆదిత్య వర్మ’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ ఈసారి కూడా అదే తరహా సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటివరకు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించని ధృవ్ ‘ఆదిత్య వర్మ’ కోసం చేసుకున్న లుక్ ను మార్చుకున్నారు.

కొత్త హెయిర్ స్టైల్ చేసుకుని షార్ప్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తే ఈసారి కూడా ధృవ్ ఏదో రఫ్ అండ్ ఎనర్జిటిక్ పాత్రలోనే నటించబోతున్నాడని అర్థమవుతోంది. మరి ఆ సినిమా ఏమిటి, దర్శకుడు ఎవరు, ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనే వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు