ఆడియోతో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్న ‘ధృవ’ !
Published on Nov 10, 2016 10:28 am IST

dhruva
మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం ‘ధృవ’ యొక్క ఆడియో మార్కెట్లోకి మొన్న అర్థరాత్రిన విడుదలయ్యాయి. ఇటువంటి ఆడియో కార్యక్రమం లేకుండా రిలీజ్ చేసిన ఈ ఆడియో పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్న ఈ ఆడియో ఆల్బమ్ అభిమానుల ఆంచనాలను అందుకుంటూనే సినిమాపై ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసింది. సాధారణంగా సినిమా అంటే ఆరు పాటలు ఉండాలన్న సాంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. కానీ ‘ధృవ’ మాత్రం ఈ రొటీన్ సాంప్రదాయాన్ని కాదని కొత్త విధానాన్ని అవలంబించింది.

ఆడియోను వింటుంటే లిస్ట్ లోని ప్రతి పాట కొత్తగా, క్లాసీగా అనిపిస్తున్నాయి. హిప్ హాఫ్ తమీజా సంగీతం కూడా కాస్త భిన్నంగా ఉంది. ఈ పాటలన్నీ సందర్భానుసారంగా, కీలకమైన సన్నివేశాల కోసమే రూపొందించినట్లు అనిపిస్తోంది. పైగా దర్శకుడు సినిమాలోని కథా కథనాలపై ఎక్కువ దృష్టి పెట్టాడని కూడా అర్థమవుతోంది. దీంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఒక మంచి కథాబలమున్న సినిమాను చరణ్ అందివ్వబోతున్నాడనే నమ్మకం కలుగుతోంది.

 
Like us on Facebook