శృతి హాసన్ విషయంలో పొరపాటు జరిగిందన్న డాలి !

శృతి హాసన్ విషయంలో పొరపాటు జరిగిందన్న డాలి !

Published on Mar 28, 2017 1:39 PM IST


పవన్ కళ్యాణ్, శృతిహాసన్ లు జంటగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం గత శుక్రవారం విడుదలైన సంగతి తెసిందే. సినిమా చూసిన చాలా మంది శ్రుతిహాసన్ స్క్రీన్ రీజెన్సీ అస్సలు బాగోలేదనే విమర్శలు చేశారు. కొందరు క్రిటిక్స్ సైతం కొన్ని సన్నివేశాల్లో, ముఖ్యంగా ఫారిన్ లొకేషన్లో చిత్రేయీకరించిన రెండు పాటల్లో శృతి డ్రెస్సింగ్ స్టైల్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదని పైగా కాస్త ఇబ్బందిగా కూడా ఉందని అన్నారు.

దీనిపై నిన్న జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు డాలీని వివరం కోరగా ఆయన కూడా ఈ ఫీడ్ బ్యాక్ ను మేము కూడా విన్నాం. శృతి కాస్ట్యూమ్స్ ను ముంబై బేస్డ్ డిజైనర్ రూపొందించారని, షూటింగ్ కు ముందు వాటిని చూసి తమకు కూడా పూర్తి సంతృప్తి కలుగలేదని, ఇక చివరి నిముషంలో వేరే ప్రత్యాన్మాయం లేకపోవడంతో చేసేది లేక వాటితోనే చిత్రీకరణ కానిచ్చేశామని అన్నారు. అలాగే శృతి హాసన్ మాత్రం ఎలాంటి లోటు లేకుండా సినిమా కోసం కష్టపడ్డారని కూడా తెలియజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు