నేచురల్ స్టార్ తో నేచురల్ డైరెక్టర్ ?

నేచురల్ స్టార్ తో నేచురల్ డైరెక్టర్ ?

Published on Oct 18, 2017 7:00 PM IST

ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్ సినిమాలతో ప్రేక్షకుల్లో ఒక బ్రాండ్ వేసుకున్న శేఖర్ కమ్ముల ఆమధ్య తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక సినిమాలు పెద్దగా ఆడలేదు. కొంత గ్యాప్ తీసుకొని చేసిన ఫిదా సినిమా ఎంతటి సంచలన విజయం అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాతో కమ్ బ్యాక్ అయిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆ సినిమా తరువాత మరే సినిమా ప్రకటించలేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈమధ్య శేఖర్ కమ్ముల నానికి కథ వినిపించడం జరిగిందంట. నాని పాయింట్ నచ్చి డెవలప్ చెయ్యమని చెప్పినట్లు సమాచారం, వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనడం సహజం. ప్రస్తుతం నాని ‘ఎంసిఎ’ సినిమా లో నటిస్తున్నాడు, ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు