నితిన్ ‘చిన్నదాన..’కి మొదలైన డబ్బింగ్

నితిన్ ‘చిన్నదాన..’కి మొదలైన డబ్బింగ్

Published on Oct 23, 2014 3:16 PM IST

chinnadana-nikosam
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం చాలా చాలా హ్యాపీ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే నితిన్ తన కెరీర్లో హట్రిక్ హిట్ అందుకున్నాడు, అంతే కాకుండా దీపావళి కానుకగా విడుదల చేసిన ‘చిన్నదాన నీకోసం’ ఫస్ట్ లుక్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో నితిన్ ఈ దీపావళిని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ‘చిన్నదాన నీకోసం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

షూటింగ్ చివరి దశకి చేరుకోవడంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా ఈ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ప్రసతుతం ఈ సినిమాలో నటించిన నటీనటులకి సంబందించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నితిన్ కూడా తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నాడు.

రొమాంటిక్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోని నవంబర్ లో రిలీజ్ చేసి డిసెంబర్ 19న సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు