ప్రత్యేక ఇంటర్వ్యూ : నిఖిల్ – దేనికీ టెంప్ట్ అవ్వను, కథ నచ్చితేనే సినిమా చేస్తా.!

ప్రత్యేక ఇంటర్వ్యూ : నిఖిల్ – దేనికీ టెంప్ట్ అవ్వను, కథ నచ్చితేనే సినిమా చేస్తా.!

Published on Dec 3, 2015 12:50 AM IST

nikhil
‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య vs సూర్య’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకొని డబుల్ హ్యాట్రిక్ కోసం చేసిన సినిమా ‘శంకరాభరణం’. గత మూడు సినిమాలకు సంబంధం లేకుండా క్రైమ్ కామెడీ జానర్లో చేసిన ఈ సినిమాకి కోన వెంకట్ కర్త కర్మ క్రియలా వ్యవహరించారు. డిసెంబర్ 4న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిఖిల్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీకోసం..

ప్రశ్న) ‘హ్యాపీ డేస్’ తర్వాత వచ్చిన సినిమాలన్నీ చేసేసారు కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ వచ్చాయి. ఆ తర్వాత పంథా మార్చి ఒక్కసారిగా హిట్స్ ఇస్తూ వచ్చారు. ఏ సందర్భం నుంచి మీరు కథా బలం ఉన్న సినిమాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు?
స) నాకు ఎలాంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేదు. అందుకే నా తప్పులని నేనే తెలుసుకొని కరెక్ట్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది, అలాగే ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారు అనే రీసర్చ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక్కోసారి పెద్ద బ్యానర్ అని, ఒక్కోసారి ఆబ్లిగేషన్ మీద సినిమాలు చేస్తాం. కానీ నా 8వ సినిమా డిస్కో టైంలో ఒక సినిమా విజయానికి కథే కారణం, కథ బాగుంటేనే సినిమా ఆడుతుంది అని రియలైజ్ అయ్యాను. సో కథ బాగుంటేనే సినిమా చెయ్యాలని ఫిక్స్ అయిపోయాను. అక్కడి నుంచి ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా, స్టార్ డైరెక్టర్ అయినా, స్టార్ ప్రొడక్షన్ బ్యానర్ అయినా.. ఇలా ఎవరు ఎంత టెంప్ట్ చేసినా కథ నచ్చితేనే సినిమా చెయ్యాలనే రూల్ ని పెట్టుకొని దాన్నే ఫాలో అయిపోతున్నాను. ఒక్కటే అండీ నేను ఓకే చెప్తే కథ బాగుండాలి, అలాగే నాకు నటుడిగా సంతృప్తి ఇచ్చేలా ఉండాలి. ఇక అది హిట్టా ఫట్టా అన్నది ప్రేక్షకులే నిర్ణయిస్తారు.

ప్రశ్న) మరి ఇప్పుడు కథల విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు?

స) నా మొదటి టార్గెట్ ఒక్కటే.. సినిమా సినిమాకి పోల్చుకుంటే కథ మరియు నిఖిల్ పాత్ర కొత్తగా ఉండాలి, గత సినిమాలకి సిమిలర్ గా ఉండకూడదు. అందుకే సినిమా సినిమాకి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ని ట్రై చేయడమే కాకుండా అది ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది చూసి స్టొరీ సెలక్ట్ చేస్తున్నాను. చెప్పాలంటే స్వామి రారా తర్వాత అలాంటి కథలు చాలా వచ్చాయి, అవి బాగుంటాయి కూడా కానీ అవి చేస్తే నిఖిల్ మళ్ళీ అదే చేసాడు అంటారు. ఆ ముద్ర లేకుండా నన్ను ఎగ్జైట్ చేసే డిఫరెంట్ కథలకే ప్రాధాన్యత ఇస్తూ స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటున్నాను.

ప్రశ్న) ‘శంకరాభరణం’ కథకి మీరు సైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటి?
స) కథే నన్ను ఈ సినిమాకి సైన్ చేసేలా చేసింది. మొదట కోన గారు స్టొరీ లైన్ చెప్పక నాకు ఫుల్ నేరేషన్ కావాలంటే డెవలప్ చేసి చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఇంకా డెవలప్ చేసి చెప్తానని రెండోసారి చెప్పినప్పుడు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాయింట్ తో పాటు, సినిమా స్టార్ట్ టు ఎండ్ నవ్వుకునేలా ఉంటుంది. అలా అని కోన గారి గత సినిమాలా టెంప్లెట్ లో అయితే అస్సలు ఉండదు. ఇలాంటి ఓ కమర్షియల్ కాన్సెప్ట్ ని నా కెరీర్లో ఇప్పటి వరకూ చేయలేదు.

ప్రశ్న) గత సినిమాలతో పోల్చుకుంటే మీ పాత్ర ఎంత కొత్తగా ఉండబోతోంది?
స) ఎందులో ఎన్నారై పాత్ర చేసాను. ఎన్నారైలో ఎబిసిడి టైపు పాత్ర నాది. ఎబిసిడి అంటే ఎన్నారై బోర్న్ కన్ఫ్యూజ్ దేశీ.. ఒక్కసారి కూడా ఇండియాకి రాని వాడిని బీహార్ లో పడేస్తే వాడి పరిస్థతి ఎలా ఉంటుందనేది నాకు నచ్చింది. అలాగే సినిమా ట్రావెలింగ్ లో మొదట నా పాత్ర చాలా క్లాస్ గా ఉంటుంది, చివరికి వచ్చేసరికి పూర్తి మాస్ గా మారిపోతుంది. నా పాత్రలో వచ్చే మార్పు కూడా నాకు బాగా నచ్చింది. ఇలాంటి పాత్ర నేను ఇప్పటివరకూ చేయలేదు.

ప్రశ్న) ‘పస్ గయారే ఓబామా’ నుంచి స్ఫూర్తి తీసుకొన్నారు. మరి ఆ సినిమాకి ఈ సినిమాకి ఉన్న తేడా ఏంటి?
స) పస్ గయారే ఓబామాలో ఒక మెయిన్ పాయింట్ ని మాత్రమే తీసుకొని దానికి బోలెడంత కామెడీ యాడ్ చేసి ఈ సినిమా చేసాం. అలాగే హిందీ వెర్షన్ లో సెంటిమెంట్, ఎమోషన్స్ అనేవి ఉండవు కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. లవ్ స్టొరీ, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నిటినీ కోన గారు పర్ఫెక్ట్ గా మిక్స్ చేసారు. అందుకే కథా పరంగా పస్ గయారే ఓబామా సినిమాకి దీనికి అస్సలు సంబంధం ఉండదు.

ప్రశ్న) మొదటి సారి సీనియర్ రైటర్ అయిన కోన వెంకట్ తో పనిచేసిన అనుభవం ఎలా ఉంది? అలాగే మీకు ఆయన రైటర్ గా ఇష్టమా? దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఇష్టమా?
స) కోన గారికి వర్ల్ సినిమా మీద చాలా మంచి గ్రిప్ ఉంది. ఆ విషయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అలాగే ఆయన సెట్లో స్టార్ రైటర్ లా ఉండరు, అందరితో కలిసిపోయి జోక్స్ వేస్తూ నటుల నుంచి తనకి కావాల్సింది తీసుకుంటాడు. కోన గారికి అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉంది. అందుకే కోన గారిలోని అన్ని డిపార్ట్మెంట్స్ నాకిష్టం. ఈ సినిమాకి కథ రాసేసాను నా పైనైపోయింది అని కాకుండా నేను పేపర్ మీద రాసింది పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా అనేది ఆయన దగ్గరుండి చూసుకున్నారు.

ప్రశ్న) మొదటిసారి మీ సినిమా యుఎస్ లో 80 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది, అలాగే డిఫరెంట్ కంట్రీస్ లో కూడా రిలీజ్ అవుతోంది. ఈ విషయంలో ఎలా ఫీలవుతున్నారు?
స) చెప్పాలంటే కొంత టెన్షన్ గా ఉంది.. కానీ నాకు ఒకేసారి ఈ మార్కెట్ రాలేదు, ప్రతి సినిమాకి కొంత కొంత పెంచుకుంటూ రావడం వలన ఈ సినిమాకి ఇంతలా బిజినెస్ అయ్యింది. అన్ని సినిమాల్లానే ఈ సినిమా కూడా అందరికీ నచ్చి, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ డబ్బు తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) అంజలి లాంటి స్టార్ ని ఇందులో పెట్టారు. తన పాత్ర మీ హీరో ఇమేజ్ ని డామినేట్ చేసేస్తుందేమో అని భయపడలేదా?
స) అలాంటి భయం ఏమీ లేదండి. ఎందుకంటే మా సినిమా కథకి అంజలి లాంటి స్టార్ ఇమేజ్ పవర్ ఉన్న యాక్టర్ కావాలి. ఎందుకు అంటే ఆ పాత్ర సెకండాఫ్ లో సినిమా మొత్తాన్ని షేక్ చేస్తుంది. గతంలో సినిమాని షేక్ చేయగల స్టార్ ఇమేజ్ సావిత్రి గారికి, రమ్యకృష్ణ గారికి ఉండేది. ఈ జెనరేషన్ లో అంజలికి ఆ ఇమేజ్ ఉంది. అందుకే అంజలిని సెలక్ట్ చేసుకున్నాం. సుమారు అంజలి పాత్ర 15-20 నిమిషాలు ఉంటుంది. అంజలి ఎంట్రీ నుంచి సినిమా స్పీడప్ అవ్వడమే కాకుండా సినిమా పీక్స్ స్టేజ్ కి తీసుకెళ్తుంది. అంజలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బందిపోటు రాణిగా అంజలి రచ్చ రచ్చ చేసింది.

ప్రశ్న) మీరు యాక్టర్ కావడానికి మిమ్మల్ని ఇన్స్ప్రైర్ చేసిన స్టార్ ఎవరు?
స) నా చైల్డ్ హుడ్ నుంచి నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రవితేజ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. నేను యాక్టర్ అవ్వడానికి వీరిద్దరే నాకు స్ఫూర్తి. రవితేజ గారి ఈజ్, యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇక పవన్ గారి స్టైల్ అండ్ ఆయన సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం అందుకే ఆయన్ని నేను రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడాహీరో అంటాను.

ప్రశ్న) యాక్టర్ గా కాకుండా నిఖిల్ రియల్ లైఫ్ లో ఎలాంటి పర్సన్?
స) నేను యాక్టర్ గా కాకుండా అంటే ట్రావెలింగ్ అంటే నాకు పిచ్చి.. ఖాళీ దొరికితే ఎక్కడికో ఓకేచోటకి వెళ్ళిపోదాం అనుకుంటాను. చనిపోయే లోపు 100 ప్లేసెస్ విజిట్ చేయాలని ఒక లిస్టు పెట్టుకున్నాను. ఆ లిస్టుని ఫినిష్ చేసుకుంటూ వెళ్తున్నాను.

ప్రశ్న) మీరు కమిట్ అయిన తదుపరి సినిమాల గురించి చెప్పండి?
స) విఐ ఆనంద్ డైరెక్షన్ లో నెక్స్ట్ మూవీ చేస్తున్నాను. అది ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. ఫిబ్రవరిలో కార్తీక్ రెడ్డి డైరెక్షన్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా ఉంటుంది. ఆ సినిమా తర్వాత చందూ మొండేటితో కలిసి ‘కార్తికేయ 2’ చేయనున్నాను. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి.

ప్రశ్న) ఫైనల్ గా శంకరాభరణం గురించి తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు?
స) ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలని చేసిన సినిమా ఇది. సినిమా సూపర్, డూపర్, కేవ్వుకేక అని ముందే చెప్పదలచుకోలేదు.. కానీ ఒకటి గ్యారంటీ ఇస్తాను., ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసివెళ్ళి బాగా ఎంజాయ్ చేసి, నవ్వుకుంటూ బయటకి వచ్చే సినిమానే ‘శంకరాభరణం’.

అంతటితో నిఖిల్ తో మా ఇంటర్వ్యూని ముగించి, శంకరాభరణం సెకండ్ హ్యాట్రిక్ హిట్స్ కి నాంది పలకాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము.

ఇంటర్వ్యూ – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు