ప్రత్యేక ఇంటర్వ్యూ : సుదీర్ బాబు – నేను మహేష్ బాబు స్ట్రాటజీ ఫాలో అవుతాను..

ప్రత్యేక ఇంటర్వ్యూ : సుదీర్ బాబు – నేను మహేష్ బాబు స్ట్రాటజీ ఫాలో అవుతాను..

Published on Jun 5, 2013 6:15 PM IST

Sudheer Babu (22)

సూపర్ స్టార్స్ ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన హీరో సుధీర్ బాబు. సుధీర్ బాబుకి సూపర్ స్టార్ కృష్ణ గారు మామయ్య, మహేష్ బాబు బావమరిది అవుతారు. తన మొదటి సినిమా ‘ఎస్ఎంఎస్’ సినిమాతో మంచి మార్కులు వేయించుకున్న సుధీర్ బాబు తన తాజా చిత్రం ‘ప్రేమ కథా చిత్రమ్’ తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకి కథ మరియు నిర్మాత మారుతి. ఈ సందర్భంగా సుధీర్ బాబుతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆ విశేషాలు మీకందిస్తున్నాం..

ప్రశ్న) ప్రేమ కథా చిత్రమ్ మూవీ విడుదలకు దగ్గరవుతున్న కొద్దీ మీ ఫీలింగ్ ఎలా ఉంది?

స) ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడానికి ఎదురు చూసే ఒక చిన్న పిల్లాడిలా ఫీలవుతున్నాను. కానీ నేను నర్వస్ గా లేను ఎందుకంటే ప్రిన్సిపల్ నా పక్కనే కూర్చిని ఎగ్జామ్ రాయిస్తున్నాడు. ఆ ప్రిన్సిపల్ ఎవరో కాదు మారుతి గారే కావున సినిమా విజయం పై పూర్తి నమ్మకంతో ఉన్నాను.

ప్రశ్న) ఇది మీ సెకండ్ మూవీ. ఈ సినిమా ద్వారా నటుడిగా ఏమి చూపించబోతున్నారు?

స) నా మొదటి సినిమాలో నేను డాన్సులు, ఫైట్స్ చేయగలనని చూపించాను. ఈ సినిమాలో నేను బాగా నటించగలనని రుజువవుతుంది. నేను పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాను, ఆ పాత్ర చాలా సున్నితంగా ఉంటుంది, ఎలాంటి హీరోయిజం ఆ పాత్రకి అవసరం లేదు. ‘ఒక కథకి కావాల్సినట్టుగా నటించే హీరో అనిపించుకుంటాను’.

ప్రశ్న) ‘ప్రేమ కథా చిత్రమ్’ ని రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని అనొచ్చా?

స) అవును. మీరు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని పిలవొచ్చు. కానీ ఇందులో అవసరమైనంత వరకూ కొన్ని కమర్షియల్ అంశాలను జోడించాం.

ప్రశ్న) అడల్ట్ కామెడీని చూపించడంలో మారుతికి పేరుంది. ఈ సినిమా కూడా అలానే ఉంటుందా?

స) లేదు. ఇది డిఫరెంట్ ఫిల్మ్. ఇదివరకూ మారుతీ ఎంచుకున్న కథలకు అలాంటి డైలాగ్స్ అవసరం. కానీ ప్రేమ కథా చిత్రమ్ పూర్తి డిఫరెంట్ మూవీ. ఇది మనిషిలోని భావాలను చూపించే సినిమా. ఇందులో అడల్ట్ కామెడీ చూపించాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాలో చాలా కామెడీ ఉంటుంది, మారుతికి కామెడీనే బలం. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు రెండు గంటల పాటు బాగా నవ్వుకొని ఎంటర్టైన్ అవుతారు.

ప్రశ్న) ఈ సినిమాలో ఉన్న కొత్త పాయింట్ ఏమిటి?

స) సినిమాలో నాలుగు పాత్రలుంటాయి, ఆ నాలుగు పాత్రలతోనే ప్రేక్షకులు బాగా ఎంటర్టైన్ అవుతారు. ఈ సినిమాలో లవ్ స్టొరీని డీల్ చేసిన విధానం కొత్తగా ఉంటుంది. అలాగే హీరో హీరోయిన్ మధ్య పుట్టే లవ్ ని చాలా కొత్తగా చూపించారు.

ప్రశ్న) ప్రభాకర్ రెడ్డి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అతని పనితనం విషయంలో మీరు హ్యాపీగా ఉన్నారా?

స) అతని పనితనం చాలా బాగుంది. గతంలో కూడా కొంతమంది సినిమాటోగ్రాఫర్స్ డైరెక్టర్స్ గా మారి సక్సెస్ఫుల్ చిత్రాలను అందించారు. ప్రభాకర్ రెడ్డి కూడా ఎంతో విజయవంతంగా సినిమాని తీసి, మంచి క్వాలిటీ అవుట్ పుట్ తో దర్శకుడవుతున్నాడు.

ప్రశ్న) ఈ సినిమాపై మారుతి గారి ప్రభావం ఎంతవరకూ ఉంది?

స) మారుతి గారు సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం ఉన్నారు, మొత్తం సినిమా పైన ఆయన ప్రభావం ఉంటుంది. ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్టర్ అయినప్పటికీ మారుతి గారు ప్రతి ఒక్క షాట్ లోనూ ఉన్నారు. డబ్బింగ్, ఎడిటింగ్, మిగిలిన టెక్నికల్ విభాగాలను కూడా ఆయన పర్యవేక్షించారు. నటీనటులకి, టెక్నికల్ టీం కి చెప్పే ముందు ప్రభాకర్ రెడ్డి – మారుతి గారు బాగా చర్చించుకొని మాకు చెప్పేవారు.

ప్రశ్న) నందిత ఎ జాబితాకి చెందిన హీరోయిన్?

స) తెరపై హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, ఈ ఈ క్వాలిటీలు ఉండాలి అని అనుకునే విభాగానికి చెందిన హీరోయిన్ నందిత. కానీ నందిత ఆఫ్ స్క్రీన్ కూడా అలానే అనిపిస్తుంది ఆలా అనిపించే వారు చాలా తక్కువ ఉంటారు. నందిత చాలా సింపుల్ గా,ఎలాంటి ఆర్భాటం లేకుండా ఉంటుంది. ఈ సినిమాకి ఆ అమ్మాయి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అలాగే రెండవ సినిమాతోనే ఇంత మంచి పాత్ర ఆ అమ్మాయికి దక్కడం ఎంతో లక్ అని చెప్పుకోవాలి.

ప్రశ్న) కృష్ణ గారు లేదా మహేష్ బాబు గానీ ఈ సినిమాని చూసారా?

స) లేదు, ఇంకా చూడలేదు.

ప్రశ్న) రాబోయే 5 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు?

స) నాకు నేనుగా ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోలేదు. డైరెక్ట్ గా చెప్పాలంటే దాని గురించి నేను అస్సలు ఆలోచించలేదు. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నాకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఎంతో సిన్సియర్ గా, నిజాయితీగా చెయ్యాలనుకుంటున్నాను. అది నన్ను ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ నిలబెడుతుందో చూద్దాం.

ప్రశ్న) మీ కెరీర్ చాయిస్ లో మహేష్ బాబు ప్రభావం ఉంటుందా?

స) నేను మహేష్ బాబు గారి స్ట్రాటజీని గుడ్డిగా ఫాలో అవుతాను. మహేష్ బాబు గారి కెరీర్ మొదట్లో ఆయన కొన్ని తరహా కథలని, పాత్రలని మాత్రమే ఎంచుకునే వారు ఎప్పుడైతే ఆయన అవి చేయడం మానేశారో అప్పుడే ఆయనకీ అసలైన సక్సెస్ వచ్చింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి కథ వింటున్నారు, వాటిల్లో నుంచి బెస్ట్ కథల్ని ఎంచుకుంటున్నారు. నేను కూడా ఇంచు మించు ఆయనలానే చేస్తున్నాను. ‘ఏదో స్పెషల్ రోల్ కోసం వేచి చూసే కంటే నాకు వచ్చిన కథల్లో మంచి స్క్రిప్ట్ తీసుకొని 100% ఎఫర్ట్ పెట్టడం కరెక్ట్ కదా’.

ప్రశ్న) నీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ప్రకారం మిమ్మల్ని కొంతమంది మహేష్ బాబు గారితో పోలుస్తారు. దాన్ని ఎలా డీల్ చేస్తారు?

స) అది అస్సలు కరెక్ట్ కాదు, ఒకవేళ అలా కొంతమంది ఆలోచిస్తుంటే అది చాలా తప్పు. మహేష్ ఒక సూపర్ స్టార్. అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, రెంజే వేరు. నేను ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టాను, ఒకవేళ నన్ను అలా పోల్చాలనుకుంటే ఇప్పుడే వచ్చిన కొత్త హీరోలతో గానీ, లేదా ఒక సినిమా చేసిన హీరోతోనో పోల్చడం కరెక్ట్. కానీ మహేష్ బాబు గారి ఫాన్స్ ఏ నాకు పెద్ద సపోర్ట్. మహేష్ బాబు గారు, ఆయన ఫ్యాన్స్ లేకపోతే నా మొదటి సినిమా ఎస్ఎంఎస్ సినిమాకి వచ్చిన దానిలో 50% కూడా వచ్చేది కాదు.

ప్రశ్న) మీరు ఎంచుకునే కథలో ఏమేమి చూస్తారు?

స) నేను అన్ని రాకల కథలకి ఆహ్వానం పలుకుతాను. కథ కొత్త గా ఉంది, ఆ పాత్రకి నేను సరిపోతాను అనుకుంటే ఆ సినిమా చేస్తాను.

ప్రశ్న) మీకు రీమేక్స్ చేయడం అంటే ఇష్టమేనా?

స) అవును. కానీ రీమేక్స్ చేయడం అనేది ఒక చాలెంజ్. అలాంటి సినిమాలకి ప్రేక్షకులు కొన్ని అంచనాలతో వస్తారు, ఆ అంచనాలను అందుకోవాలి.

ప్రశ్న) మీరు ప్రేక్షకులకి ఏమి చెప్పాలనుకుంటున్నారు?

స) చాలా ఫ్రెష్ గా, కొత్తగా ఉంటుందని ఆశించి థియేటర్ కి రండి. ‘హీరోయిజం, డాన్సులు, ఫైట్స్ ఆశించి ఈ సినిమాకి రావద్దు’. అవి కూడా ఉంటాయి కానీ ఓ మంచి కథ, సున్నితమైన భావాలను చూపించే నటీనటుల నటన ఈ సినిమాకి మేజర్ హైలైట్.

ప్రశ్న) మీరు భవిష్యత్తులో చేయనున్న సినిమాలేమిటి?

స) భవిష్యత్తులో ఖచ్చితంగా బాడ్మింటన్ స్టార్ గోపి చంద్ పై సినిమా తీస్తాను. చాలా కాలంగా అతనితో మాట్లాడుతున్నాను, నేను అతని కథని తెరపై చూపించాలనుకుంటున్నాను. అది కాకుండా ‘మాయదారి మల్లిగాడు’, ‘ఆడు మగాడు రా బుజ్జి’ అనే సినిమాలకు సైన్ చేసాను. ఆ తర్వాత చేయబోయే సినిమా ఎస్ ఎస్ రాజమౌళి కో డైరెక్టర్ రామకృష్ణ డైరెక్షన్ లో ఉంటుంది.

అంతటితో సుధీర్ బాబుతో మా ఇంటర్వ్యూని ముగించాము. ఈ యంగ్ స్టార్ రాబోయే సినిమా విజయ వంతం కావాలని ఆల్ ది బెస్ట్ చెప్పండి.

ఇంటర్వ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : రాఘవ


Click here for English Interview

సంబంధిత సమాచారం

తాజా వార్తలు