ఓటిటి రివ్యూ : గతం – ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా

ఓటిటి రివ్యూ : గతం – ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా

Published on Nov 6, 2020 2:00 PM IST
gatham Telugu Movie Review

విడుదల తేదీ : నవంబర్ 6, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : భార్గవ పోలుదాసు, రాకేశ్ గలేభే, పూజిత కురపర్తి

దర్శకత్వం : కిరణ్ కొండమడుగుల

నిర్మాత : ఎస్ ఒరిజినల్స్, ఆఫ్ బీట్ ఫిల్మ్స్

మ్యూజిక్ : శ్రీచరన్ పాకల

సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి

 

ఇటీవలే నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి అనేక ఆసక్తికర సినిమాలు విడుదల కావడం మనం చూసాము. అలా ఇప్పుడు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబడిన చిత్రం “గతం”. ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

అమెరికా లో ఉన్న ఒక హాస్పిటల్ లో రిషి(రాకేష్) తన గతాన్ని మర్చిపోయి ట్రీట్మెంట్ నుంచి లేస్తాడు. అక్కడ అతని గర్ల్ ఫ్రెండ్ అదితి(పూజిత) అతడి తండ్రి దగ్గరకు చేర్చేందుకు సహాయం చెయ్యడానికి ట్రై చేస్తుంది. ఆ క్రమంలో కారులో అతన్ని తీసుకెళ్తుండగా సడెన్ గా రోడ్ పై వారి కారు బ్రేక్ డౌన్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో వారికి ఒక గుర్తు తెలియని వ్యక్తి(భార్గవ పోలుదాసు) ఇద్దరికీ లిఫ్ట్ ఇచ్చి వారి ఇంటికే అని తీసుకెళ్తాడు. కానీ అదే సమయంలో ఊహించని విధంగా రిషి, అదితిలు అతడు వారిని టార్గెట్ చేసాడని తెలుసుకుంటారు. ఇంతకీ ఈ అజ్ఞ్యాత వ్యక్తి ఎవరు? వాళ్ళకి ఇతనికి సంబంధం ఏమిటి? రిషి ఎందుకు గతం మర్చిపోయాడు అన్నవి అసలు అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మొట్టమొదటిగా ఈ సినిమాలో మాట్లాడాలి అంటే నిర్మాణ విలువలు కోసం చెప్పాలి. ట్రైలర్ లోనే అద్భుతమైన కెమెరా వర్క్ చూపిన యూనిట్ సినిమాలో కూడా అమేజింగ్ విజువల్స్ ను చూపించారు. కొన్ని డ్రోన్ షాట్స్ చూస్తే హాలీవుడ్ టేకింగ్ లా కూడా అనిపిస్తుంది. అలాగే శ్రీచరణ్ పాకల అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఇంప్రెసివ్ గా ఉంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే మెయిన్ లీడ్ రాకేష్ తన రోల్ కు సెటిల్డ్ గా పర్ఫెక్ట్ గా చేసాడు. కాకపోతే అతడి వాయిస్ మాడ్యులేషన్ కాస్త విజయ్ దేవరకొండను తలపిస్తుంది. ఇక మిగతా అంతా ఓకే అనిపిస్తాడు. ఇక సినిమా అంతా సపోర్టింగ్ రోల్ లో ఆధ్యంతం కనిపించిన హీరోయిన్ పూజిత మంచి నటనను కనబరిచింది. అలాగే విలన్ రోల్ లో కనిపించిన భార్గవ్ మంచి అవుట్ ఫుట్ ను ఇచ్చారు. అతడు కనబర్చిన డార్క్ షేడ్స్ ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి.

అలాగే సినిమాలోని కథనం కానీ కథానుసారం వచ్చే ట్విస్టులు కానీ డీసెంట్ గా అనిపిస్తాయి. వీటితో పాటుగా సినిమాలో సాగే ఇన్వెస్టిగేషన్, మరికొన్ని ఆసక్తికర అంశాలు బాగా అనిపిస్తాయి. అలాగే సినిమాకు ఇచ్చిన ముగింపు కూడా అలా డీసెంట్ గా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కు వస్తే ఈ చిత్రంలో చాలా అంశాలకు పొంతన ఉండదు. యూఎస్ లాంటి ప్రాంతంలోనే కొన్ని లాజిక్స్ మిస్సవడం మాత్రమే కాకుండా క్యారక్టరైజేషన్ ఎస్టాబ్లిషన్ విధానంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుణ్ణు అనిపిస్తుంది.

అలాగే సినిమా ఆరంభం కూడా అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. వాటికి తోడు క్యాస్టింగ్ అంతా కొత్తది కాబట్టి సెటిల్డ్ గా చూడ్డానికి కాస్త సమయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాతనే ఈ అంశాలు ఆసక్తికరంగా మారుతాయి.

అలాగే కొన్ని ట్విస్టులు మరియు ఎండింగ్ ను ఇంకా ఆసక్తిగా మలచి ఉంటే బాగుండేది. అలాగే పలు సన్నివేశాలను కూడా ముందే ఊహించేస్తాం(ముఖ్యంగా క్లైమాక్స్) ఇవన్నీ లోపాలే.

 

సాంకేతిక వర్గం :

 

ముందు చెప్పినట్టుగానే సినిమాలోని నిర్మాణ విలువలు అవుట్ ఆఫ్ ది బాక్స్ కనిపిస్తాయి. కెమెరా వర్క్ కానీ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి ఇంప్రెసివ్ గా అనిపిస్తాయి. అలాగే డబ్బింగ్, డైలాగ్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఓకే అని చెప్పొచ్చు. ఇక దర్శకుని పనితనంకు వచ్చినట్టయితే తన మొదటి సినిమా మంచి ప్రయత్నం అని చెప్పొచ్చు.

తాను సినిమా రాసుకున్న విధానం డీసెంట్ గా అనిపిస్తుంది.అలాగే సినిమా తెరకెక్కించిన విధానం బాగుంది. అలాగే తాను చూపాలనుకున్న విజువల్స్ ను కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసారు. కానీ కొన్ని లోటు పాట్లు అయితే ఉన్నాయి. కొన్ని కీలక సందర్భాలను ఇంకా బాగా రాసుకొని ఉండాల్సింది. అలాగే సినిమాలోని రోల్స్ తో వచ్చే ట్విస్టులను ఇంకా ఇంప్రెసివ్ గా చూపిస్తే బాగుండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూస్కుకున్నట్టయితే “గతం”ను ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ని చెప్పొచ్చు. డీసెంట్ స్టోరీ లైన్, నిర్మాణాత్మక విలువలు, కథానుసారం వచ్చే కొన్ని ట్విస్టులు ఇంప్రెస్ చేస్తాయి. కొత్త క్యాస్టింగ్, ఓకే అనే అనిపించే థ్రిల్లర్ సినిమాలను చూడొచ్చు అనుకునే వాళ్ళకి గతం ఒక ఆప్షన్ గా నిలుస్తుంది.

 

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

 

Click Here For English Review

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు