జిబ్రాన్ కెరీర్ లో టఫ్ మ్యూజిక్ ఆల్బమ్ ‘ఉత్తమ విలన్’

జిబ్రాన్ కెరీర్ లో టఫ్ మ్యూజిక్ ఆల్బమ్ ‘ఉత్తమ విలన్’

Published on Sep 1, 2014 8:55 AM IST

Ghibran

‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల చేత బుజ్జిమా బుజ్జిమా అంటూ పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జిబ్రాన్ ప్రస్తుతం కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’, ‘ఉత్తమ విలన్’ సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

ఈ రెండు సినిమాల గురించి జిబ్రాన్ మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ నా కెరీర్లో బాగా టఫ్ గా అనిపించినది మరియు ఎక్కువ కాలం టైం తీసుకొని చేసింది ‘ఉత్తమ విలన్’ మ్యూజిక్ మాత్రమే.. ఈ సినిమా ఆల్బమ్ లో మేము 2 పాటలు రిలీజ్ చెయ్యడం లేదు. అవి రివీల్ చేస్తే ఉత్తమ విలన్ స్టొరీ లైన్ తెలిసిపోతుంది. అందుకే ఆ పాటల్ని థియేటర్ లోనే విని థ్రిల్ అవ్వాలని’ అన్నాడు.

అలాగే విశ్వరూపం 2 గురించి మాట్లాడుతూ ‘విశ్వరూపం 2 యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాఫిక్స్, గ్రాండ్ లోకేషన్స్ మొదలైనవి విశ్వరూపం కంటే డబుల్ ఇంపాక్ట్ కలిగించేలా ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ లో ఉండే ఈ సినిమా మ్యూజిక్ ని సింగపూర్ మరియు బల్గేరియాలో రికార్డ్ చేసామని’ తెలిపాడు.

కమల్ హాసన్ నటించిన ఈ రెండు సినిమాల్లో ‘ఉత్తమ విలన్’ అక్టోబర్ 2న విడుదల కానుంటే, ‘విశ్వరూపం 2’ నవంబర్ లో వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు