సురేందర్ రెడ్డి నేను చెప్పినా వినలేదు – రవితేజ

సురేందర్ రెడ్డి నేను చెప్పినా వినలేదు – రవితేజ

Published on Aug 27, 2015 8:35 AM IST

ravi-teja

ఒక కాంబినేషన్ లో హిట్ సినిమా, మళ్ళీ అదే కాంబినేషన్ లో ఇంకొంతమంది స్టార్స్ యాడ్ అయ్యి దానికి సీక్వెల్ చేస్తే ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటి అంచనాల నడుమ 2009లో వచ్చిన ‘కిక్’ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సినిమా ‘కిక్ 2’. మాస్ మహారాజ్ రవితేజ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో గతవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి మొదటి రోజు సినిమాకి లెంగ్త్ బాగా ఎక్కువ అయ్యిందని, దాంతో బోరింగ్ అనే టాక్ రాకపోవడం వలన రెండవ రోజు నుంచి సుమారు 20 నిమిషాల సినిమాని కట్ చేసారు. దాంతో సినిమా బాగా రీచ్ అవ్వడంతో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.

ఈ విషయంలో ఎవరిది మిస్టేక్ అని హీరో రవితేజని అడిగితే ‘ నా ప్రతి సినిమా విషయంలో నేను ఫైనల్ కాపీ చూసాక ఎలా ఉందనే దానిపై ఫైనల్ జడ్జ్ మెంట్ తీసుకుంటాను. కానీ ఈ సారి డైరెక్టర్ సురేందర్ రెడ్డికి వాల్యూ ఇచ్చి ఫైనల్ జడ్జ్ మెంట్ కి వదిలేసాను. కానీ నేను సినిమా లెంగ్త్ ఎక్కువైందని తనకి చెప్తూనే ఉన్నాను కానీ తనే వినలేదు. పర్ఫెక్ట్ గానే ఉందని అన్నాడు. ఫైనల్ గా రిలీజ్ అయ్యాక ఓ మంచి లెసన్ నేర్చుకున్నాడు. నేను కూడా కిక్ 2 పరంగా ఓ మంచి లెసన్ నేర్చుకున్నాను. నెక్స్ట్ కిక్ 3 ఉంటుంది కానీ ఆ సినిమా విషయంలో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటానని’ రవితేజ తెలిపాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ కిక్ 2 సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు