బాలకృష్ణకు హై కోర్ట్ నోటీసులు !

బాలకృష్ణకు హై కోర్ట్ నోటీసులు !

Published on Mar 28, 2017 4:07 PM IST


ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తన 101వ సినిమాలో నటిస్తున్న నందమూరి బాలకృష్ణకు హై కోర్ట్ నోటీసులు పంపింది. అయన 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ పన్ను రాయితీ విషయమై ఇంకో రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని కోర్టు తెలిపింది. శాతకర్ణి చిత్రం యొక్క పన్ను మినహాయింపు విషయంలో ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పారదర్శకత పాటించలేదని దాఖలైన పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

అలాగే ఈ చిత్ర నిర్మాతలకు సైతం నోటీసులు వెళ్లాయి. 2017 జనవరి సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలిపేదిగా ఉందని, కనుక ఇలాంటి చిత్రాలను ప్రోత్సహించాలన్న దృష్టితోనే పన్ను మినహాయింపు ఇస్తున్నామని గతంలో ప్రభుత్వాలు తెలిపిన సంగతి విదితమే. అలాగే తెలంగాణా ప్రభుత్వం ద్వారా ‘రుద్రమదేవి’ చిత్రానికి పన్ను మినహాయింపు పొందిన గుణశేకహ్ర్ కు కూడా హై కోర్ట్ నోటీసులు జారీ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు