ప్రభుత్వ ఉద్యోగులకు ‘హైపర్’ స్పెషల్ షోస్!
Published on Oct 2, 2016 1:03 pm IST

hyper-ram
రామ్ హీరోగా నటించిన ‘హైపర్’ సినిమా గత శుక్రవారం (సెప్టెంబర్ 30న) పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు భారీ అంచనాలను మూటగట్టుకున్న ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్ళు రాబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నిజాయితీ కలిగిన ప్రభుత్వ అధికారుల గొప్పదనం గురించి చెబుతూ వచ్చే సన్నివేశాలు అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమాను ఉద్యోగులకు అంకితం చేసిన టీమ్, తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్ షోస్ ప్రదర్శించనుందట. పలు ప్రధాన నగరాల్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్ షోస్ వేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. రామ్‌కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించారు. 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన సినిమాకు గిబ్రాన్ సంగీతం సమకూర్చారు. తండ్రి అంటే విపరీతమైన ఇష్టం ఉండే ఓ ఆసక్తికర పాత్రలో రామ్ ఇందులో మెప్పించారు.

 
Like us on Facebook