సెట్ లో వున్నప్పుడు నాకు ఆకలే వెయ్యదు – తమన్నా

సెట్ లో వున్నప్పుడు నాకు ఆకలే వెయ్యదు – తమన్నా

Published on Sep 24, 2014 9:24 AM IST

Tamanna
బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం సంపాదించిన తమన్నా ఇంకా అది కలగానే భావిస్తుంది. తమన్నా ఈ సినిమాలో ‘అవంతిక’ అనే పాత్రలో కనిపించనుంది. సమాచారం ప్రకారం ఈ పాత్రను యాక్షన్ నేపధ్యంలో రూపొందించారట

సినిమా గురించి తమన్నా ట్వీటిస్తూ “నేను బాహుబలి సినిమా సెట్ లకు వెళ్ళిన ప్రతీసారి నిజమైన నటిలా ఫీల్ అవుతాను. సాధారణంగా ఒంటి గంటకు భోజనం చేసి నేను సెట్ లో వున్నప్పుడు ఆకలి అన్నదే తెలియదు. తదుపరి షాట్ పైనే నామనసంతా నిండి వుంటుంది” అని చెప్పింది. ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్కలు కూడా నటిస్తున్న సంగతి తెలిసినదే

సంబంధిత సమాచారం

తాజా వార్తలు