కమల్ హాసన్ ‘దృశ్యం’లో శ్రీదేవి.?

కమల్ హాసన్ ‘దృశ్యం’లో శ్రీదేవి.?

Published on Jul 22, 2014 6:07 PM IST

Kamal-Haasan_sridevi

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాని వరుసగా సౌత్ ఇండియా అన్ని భాషల్లోనూ రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే రీమేక్ చేసి విడుదలైన తెలుగు, కన్నడ సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇదే సినిమాని కమల్ హాసన్ తమిళంలో కూడా రీమేక్ చేయనున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే మొదలయ్యాయి.

ప్రస్తుతం ఈ సినిమాలోని నటీనటుల కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర సినిమాకి చాలా కీలకం. తమిళ వెర్షన్లో ఈ పాత్ర చేయడానికి ఈ చిత్ర టీం ఎవర్గ్రీన్ బ్యూటీ శ్రీదేవిని సంప్రదించారు. కానీ శ్రీదేవి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ శ్రీ దేవి కనుక ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపకుండా నో చెబితే అదే పాత్రకి రమ్యకృష్ణని తీసుకోవాలనే ఆలోచనలో కమల్ టీం భావిస్తోంది.

ఒకవేళ అనుకున్నట్టుగా శ్రీదేవి ఈ సినిమాకి ఓకే చెబితే చాలా రోజుల తర్వాత ఓ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవ్తుందని చెప్పవచ్చు. మలయాళంలో ఈ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆశ శరత్ నటించగా, తెలుగులో నదియా నటించింది. మరి కమల్ హాసన్ దృశ్యం తమిళ రీమేక్ లో శ్రీదేవి నటిస్తుందా.? లేక ఆ ఆఫర్ రమ్యకృష్ణకి వేలుతుండా అనేది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు