Like us on Facebook
 
‘సైరా’ లో మెగాస్టార్ గురువు ఆయనే..?


మునుపెన్నడూ లేనివిధంగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రం ‘సైరా’. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ పాత్ర గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది.

అమితాబ్ ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి గురువుగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిగురించి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటించనుంది.

Bookmark and Share