మొదటి పావుగంటలోనే ముఖ్యమంత్రి కానున్న మహేష్ !

మొదటి పావుగంటలోనే ముఖ్యమంత్రి కానున్న మహేష్ !

Published on Apr 19, 2018 11:37 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో చేస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఆ పాత్ర ఎంతసేపు ఉంటుంది, కథలో నార్మల్ కుర్రాడిగా ప్రిన్స్ ఎంతసేపు కనిపిస్తారు వంటి సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఈ సందేహాలకు కొంత ఆశ్చర్యపోయే సమాధానమిచ్చారు కొరటాల శివ.

సినిమా మొదలైన మొదటి పావు గంటలోనే మహేష్ ముఖ్యమంత్రిగా మారిపోతారని, ఆపై సినిమా మొత్తం సిఎంగానే కనిపిస్తారని అన్నారు కొరటాల. మరి తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సిఎం పాత్ర ఎలా అలరిస్తుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. దానయ్య నిర్మించిన ఈ చిత్రం మహేష్, కొరటాల శివలు కలిసి చేస్తున్న రెండవ చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాలు, అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు