అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ఈవెంట్ ను చిత్ర బృందం నిర్వహించింది. ఈ వేడుకలో డైరెక్టర్ సుకుమార్ చిత్రం కి సంబందించిన ఎన్నో విషయాలు వెల్లడించారు. దిల్ రాజు, అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇతరులు తనకి ఏ విధంగా సహాయ పడ్డారు అనే దానిపై వివరించారు.
అయితే నిర్మాత అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పమని సుకుమార్ ను అడగడం తో, కథ చెప్పేందుకు అద్దం లో చూసి నెల రోజుల పాటు ప్రాక్టీస్ చేసిన విషయాన్ని వెల్లడించారు. ఎంతో కంగారు పడినట్లు తెలిపారు. చిరంజీవికి 20 నిమిషాల్లో కథ చెప్పాలి అని అనడం తో, సుకుమార్ బాగా ప్రిపేర్ అయినట్లు తెలిపారు. అయితే చిరుకి స్టోరీ నచ్చి, 3 గంటల పాటు కథ విని ఎంజాయ్ చేసిన విషయం ను వెల్లడించారు. అంతేకాక చిరు కథకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల సుకుమార్ థాంక్స్ తెలిపారు. అల్లు అర్జున్ కెరీర్ లో ప్రత్యేక చిత్రం గా నిలిచిన ఆర్య చిత్ర బృందం రీ యూనియన్ అవ్వడం పట్ల అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.