సలార్: ప్రశాంత్ చెప్పిన అన్ని కథల్లో, శివ మన్నార్ కథ చాలా బాగుంది – పృథ్వీరాజ్ సుకుమారన్

సలార్: ప్రశాంత్ చెప్పిన అన్ని కథల్లో, శివ మన్నార్ కథ చాలా బాగుంది – పృథ్వీరాజ్ సుకుమారన్

Published on May 7, 2024 10:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం గతేడాది థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం సెకండ్ పార్ట్ ను కూడా అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం లో ప్రభాస్ కి స్నేహితుడు గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. శివ మన్నార్ గా అధ్బుతమైన నటన కనబరిచి ప్రేక్షకులని అలరించారు. తాజాగా ఈ పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రశాంత్ తనకు చెప్పిన అన్ని కథల్లో, శివ మన్నార్ కథ చాలా బాగుంది అని అన్నారు. అంతేకాక మరొక యూనివర్స్ తో నమ్మశక్యం కానీ క్రాస్ ఓవర్ ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ తో సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగాయి. అయితే కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ కి దేశ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ శివ మన్నార్ పాత్ర కేజీఎఫ్ తో లింక్ ఉందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

సలార్ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిచగా, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు