స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్ లో 20 ఏళ్ల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చిత్ర బృందం. ఈ మేరకు సినిమాలోకి బన్నీ ఎలా ఎంటర్ అయ్యాడో నిర్మాత దిల్ రాజు మరియు డైరెక్టర్ సుకుమార్ లు స్టేజి పై వివరించారు.
దిల్ చిత్రం సక్సెస్ తర్వాత సుకుమార్ స్క్రిప్ట్ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయారు దిల్ రాజు. దిల్ మూవీ స్పెషల్ ప్రీమియర్ రోజున బన్నీని చూసి, సుకుమార్ ఎగ్జైట్ అయిన విషయాన్ని వెల్లడించారు. చాలా ఎనర్జిటిక్ గా బన్నీ ఉండేవాడు అని ఇమిటేట్ చేస్తూ తెలిపారు. ఎన్నో కథలు విన్న బన్నీ, ఆ తర్వాత తను చెప్పడంతో సుకుమార్ కథను నేరేట్ చేశారు అని దిల్ రాజు అన్నారు. బన్నీ కి కథ ఓకే అయిన తర్వాత అల్లు అరవింద్ స్క్రీన్ లోకి ఎంటర్ అయిన విషయాన్ని వివరించారు. అల్లు అరవింద్ కి పలుమార్లు స్క్రిప్ట్ వినిపించడం తో విసుగు చెందిన సుకుమార్, తన ఊరికి వెళ్తా అంటూ చెప్పిన విషయాన్ని వెల్లడించారు.
అయితే ఒక్క పాఠం ను వందసార్లు చెప్పడం అనే చిరాకు తో టీచర్ జాబ్ వదిలేసిన విషయాన్ని సుకుమార్ తెలిపారు. మొత్తం గా ఆల్లు అరవింద్ స్క్రిప్ట్ ను ఓకే చేశాక, బన్నీ ఎంటర్ అయినట్లు తెలిపారు. సినిమా కోసం అందరూ కూడా ఎంతో కష్టపడినట్లు దిల్ రాజు, సుకుమార్ లు తెలిపారు.