ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం తో మేకర్స్ ప్రత్యేక ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ వేడుక కి చిత్ర యూనిట్ హాజరు అయ్యింది. 20 ఏళ్ల క్రితం జరిగిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు చిత్ర యూనిట్. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి.
ఆర్య నుండి పుష్ప వరకూ ప్రతి సీన్ ను కొత్తగా చూపించేందుకు ఎంత ప్రాణం పెడతారు అనేది అందరికీ తెలుసు. నెవర్ ఎండింగ్ ప్యాషన్ అది. దిల్ రాజు ఆఫీస్ లో ఫస్ట్ టైమ్ సుకుమార్ ను టెర్రస్ మీద కలిశాం అని, కథ చెప్పడం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాము అని, ఫస్ట్ హాఫ్ కథ చెప్పారు అని, ప్రతీ సీన్ కి షాక్ మీద షాక్, ఇలా కూడా స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంటదా అని అనుకున్నా అని, స్క్రీన్ ప్లే లో కొత్త యాంగిల్ చూసా అంటూ చెప్పుకొచ్చారు. కథ వింటూనే క్వశ్చన్ అడిగా, హీరోకి మదర, ఫాదర్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చెప్పరు ఏంటి అని అడిగా, తను కథ చెప్తూ ఆగి, సినిమాలో స్క్రీన్ ప్లే కరెక్ట్ గా వెళ్తుంటే ఇలా ఎవరూ అడగరు అని సుక్కు అన్నాడు అని తెలిపారు. సినిమా చూసేప్పుడు ప్రతి సీన్ కు ఆడియెన్స్ క్లాప్స్ కొడుతున్నారు కానీ, నిజం గా ఈ క్వశ్చన్ అడగలేదు అంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.