ఇంటర్వ్యూ : రామ్ – శివమ్’ క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది.

ఇంటర్వ్యూ : రామ్ – శివమ్’ క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది.

Published on Sep 30, 2015 6:15 PM IST

Ram
ఈ ఏడాది ‘పండగ చేస్కో’ సినిమాతో ఆడియన్స్ ని బాగా నవ్వించి, హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ అప్పుడే మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అయ్యాడు. అదే ‘శివమ్’. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రామ్ తో కాసేపు ముచ్చటించి, శివమ్ విశేషాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘శివమ్’ సినిమా సక్సెస్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు.?
స) నేను సినిమా చూసాను.. సినిమా చాలా బాగా వచ్చింది, కచ్చితంగా 2వ తేదీన చూడబోయే ఆడియన్స్ కి కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. బయట కూడా సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అలా అన్ని కలిసి సినిమాని సక్సెస్ చేస్తాయని నమ్ముతున్నాను.

ప్రశ్న) మీ ప్రకారం శివమ్ సినిమాకి సక్సెస్ గా నిలిచే పాయింట్ ఏమిటి.?
స) ఓ ఆసక్తికరమైన స్టొరీ లైన్ తో తెరకెక్కిన టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘శివమ్’. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా రాసారు, అంతే కొత్తగా తీసారు. అది బాగా ఆకట్టుకుంటుంది.

ప్రశ్న) శివమ్ లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది.?
స) ఈ సినిమాలో కొంచెం బాగా డెప్త్ గా ఆలోచించి చేసే పాత్ర చేసాను. తనకున్న గట్స్ తో కొన్ని పనులు చేయడానికి పూనుకుంటాడు, కానీ చాలా సమస్యలతో దాన్ని ముగిస్తాడు.

ప్రశ్న) శివమ్ తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పండి.?
స) శ్రీనివాస్ రెడ్డి కొత్తవాడైనా చాలా బాగా తీసాడు. తను నాకు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు పేపర్ మీద ఏమైతే చూపించాడో దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీదకి తీసుకు వచ్చాడు. అలాగే తనకి టెక్నికల్ పరంగా అనుభవం ఉన్న వారు దొరకడంతో ఓ మంచి ప్రోడక్ట్ ని మాకు తీసి ఇచ్చాడు.

ప్రశ్న) బ్యూటిఫుల్ రాశి ఖన్నాతో పనిచేయడం ఎలా ఉంది.?
స) తనతో వర్క్ చెయ్యడం చాలా బాగుంది. మేము బాగా కలిసిపోయాం, దాంతో మా ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ కూడా చాలా బాగా వచ్చింది. అది అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) ఇప్పటి వరకూ కమర్షియల్ గా సేఫ్ బెట్ ఉన్న సినిమాలే చేసారు. ముందు ముందు ప్రయోగాత్మక సినిమాలు చేసే ఆలోచన ఉందా.?
స) గతంలో కొన్ని సినిమాలతో ప్రయోగాత్మక కథలు చేయాలని ట్రై చేసాను, కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు చేయడం లేదు. భవిష్యత్తులో నాకు ఆసక్తికరంగా అనిపించే స్క్రిప్ట్స్ వస్తే చేస్తాను.

ప్రశ్న) చూడటానికి విజువల్స్ చాలా బాగున్నాయి. మూవీ మేకింగ్ అనుభవం గురించి చెప్పండి.?
స) అవును.. శివమ్ సినిమాలోని సాంగ్స్ మాత్రం ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. నార్వేలో మునుపెన్నడూ చూడని లొకేషన్స్ లో వాటిని షూట్ చేసాం. అలాగే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ప్రశ్న) మరోసారి మిమ్మల్ని ఎప్పుడు మల్టీ స్టారర్ సినిమాలో చూడవచ్చు.?
స) మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి నేనెప్పుడు సిద్దమే.. ఎవరైనా సరే మంచి స్టొరీ లైన్స్ లేదా కథలతో వస్తే నేను కచ్చితంగా చేస్తాను.

ప్రశ్న) ‘హరికథ’ సినిమా ఎలా రెడీ అవుతోంది.?
స) ప్రస్తుతం హరికథ షూటింగ్ చివరి దశలో ఉంది.. అవుట్ పుట్ చాలా బాగా వస్తోంది.

ప్రశ్న) మీ పెదనాన్న, నిర్మాత స్రవంతి రవికిషోర్ గురించి చెప్పండి.?
స) ఆయన గురించి నేను ఏం చెప్తాను చెప్పండి.. నా కెరీర్ మొదటి నుంచి ఆయన నాతోనే ఉంటూ నాకు సపోర్ట్ ఇచ్చారు, భవిష్యత్తులో కూడా సపోర్ట్ ఇస్తారు. ఆయన 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, తనకున్న గట్ ఫీలింగ్ తోనే సినిమాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు