ప్రారంభమైన జగన్ స్టూడియోస్ టివి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్

Jagan-Studios-TV-&-Film-Ins
అతి తక్కువ వ్యయంతో, సినిమా, టీవీ సీరియల్స్ షూటింగులు జరుపుకోవడానికి అనువైన సెట్లతో చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉంటూ పదేళ్లుగా స్టూడియో నిర్వహణలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న జగన్ స్టూడియోస్ రెండు రాష్ట్రాలలోని టీవీ, సినిమా మాధ్యమాలకు శిక్షణ పొందిన మంచి నటులను అందిచాలన్న లక్ష్యంతో, జగన్ స్టూడియోలో నిర్మించబడే అనేక సీరియళ్ళ నిర్మాత దర్శకులకు ఇక్కడ శిక్షణ పొందిన దర్శకులకు పరిచయం చేసి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే ఆశయంతో ఆవిర్భవించిందే ‘జగన్ స్టూడియోస్ టీవీ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్’.

జగన్ స్టూడియోస్ టీవీ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అతిధుల, అధ్యాపకుల, విద్యార్థుల సమక్షంలో మంగళ వాయిద్యాల నడుమ పండితుల వేద మంత్రాల సాక్షిగా 25 జనవరి 2015న ఆంధ్ర ప్రజా నాట్య మండలి గౌరవ అధ్యక్షులు శ్రీ నల్లారి వెంకటేశ్వర రావు గారి చేతుల మీదుగా శుభారంభం జరుపుకుంది. దీనితోపాటు స్టూడియో లోని గ్రీన్ మాట్, బార్ అండ్ రెస్టారెంట్ లను ప్రగతి నగర్, ఎంపిటీసి శ్రీ దయాకర్ రెడ్డి, ప్రగతి నగర్ ఉపసర్పంచి శ్రీ సుదీర్ రెడ్డి గార్లు ప్రారంభించారు. దాసరి నారాయణరావు ఫోన్ చేసి మాట్లాడుతూ ‘జగన్ స్టూడియోస్ కి సంబంధించి ఏ కార్యక్రమానికైనా నేను ముందుంటానని’ తెలియజేశారు.

 

Like us on Facebook