24 గంటలలోపే భీభత్సం సృష్టించిన ఎన్టీఆర్ !
Published on Jul 7, 2017 2:43 pm IST


ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవ కుశ’ సినిమా యొక్క టీజర్ నిన్న సాయంత్రం 5 గంటల 22 నిముషాల సమయంలో విడుదలై పూర్తిగా 24 గంటలు కూడా గడవకముందే భీభత్సం సృష్టించింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ స్థ చేసిన ఈ టీజర్ ఇప్పటి దాకా 7 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది. పరిశ్రమలో టీజర్ వ్యూస్ పరంగా ఇదొక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు.

టీజర్ చూసిన అభిమానులంతా తారక్ నటనకు, చెప్పిన డైలాగులకు ఫిదా అయిపోగా సినీ సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల్లో ముఖ్యమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్ర ఇంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 
Like us on Facebook