సినిమాలపైనే దృష్టి సారించిన ఎన్.టి.ఆర్

సినిమాలపైనే దృష్టి సారించిన ఎన్.టి.ఆర్

Published on Apr 22, 2014 8:31 AM IST

jr-ntr
మామూలుగా అయితే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ తరపున స్టార్ హోదాలో ప్రచారం చేయాల్సి ఉంది. 2009 ఎలక్షన్స్ ప్రచారంలో సీనియర్ ఎన్.టి.ఆర్ తరహాలో ప్రజల్లోకి దూసుకెళ్ళి ప్రచారం చేసాడు.చంద్రబాబు నాయుడు ఈ సారి కూడా ఎన్.టి.ఆర్ ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకుంటారని అందరూ అనుకున్నారు.

కానీ ఈ విషయంలో పార్టీ ఇప్పటికీ సైలెంట్ గా ఉంది. మరోవైపు ఎన్.టి.ఆర్ తన ఫిల్మ్ కెరీర్ పై పూర్తి దృష్టంతా సారించాడు. ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం ‘రభస’ ని పూర్తి చేసే పనిలో ఉన్న ఎన్.టి.ఆర్ త్వరలో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు.

ఎన్.టి.ఆర్ వరుసగా కొన్ని హిట్స్ కొడితే అతనికి ఉన్న అభిమానుల సంద్రంతో ఇప్పుడు కాస్త తగ్గిన అతని స్టార్డం మళ్ళీ తిరిగి వస్తుంది. ట్రేడ్ పండితులు కూడా ప్రస్తుత రాజకీయాల విషయంలో ఎన్.టి.ఆర్ సైలెంట్ గా ఉండి మంచి పనిచేసాడని, అలాగే ఫుల్ గా తన సినిమాలపైనే దృష్టి పెడుతుండడం మంచి పరిణామం అని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు