హోరా హోరీకి హైలైట్ కానున్న కళ్యాణి కోడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్

హోరా హోరీకి హైలైట్ కానున్న కళ్యాణి కోడూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్

Published on Aug 29, 2015 9:26 AM IST

Kalyan-Koduri
‘చిత్రం’, ‘జయం’, ‘నువ్వు నేను’, ‘నిజం’ లాంటి పలు బ్లాక్‌ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఈ మధ్య కాలంలో తనదైన ముద్ర వేసే సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న తేజ ఈ సారి తన బ్రాండ్ మార్క్ వాల్యూతో కూడిన ‘హోరా హోరీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటి వరకూ ఎక్కువగా ఆర్.పి పట్నాయక్ తో కలిసి పనిచేసిన తేజ ఈ సారి మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చి కళ్యాణి కోడూరితో కలిసి పనిచేసాడు. మంచి పాటలు రాబట్టుకునే తేజ సూపర్బ్ మెలోడీస్ ఇచ్చే కళ్యాణి కోడూరి మంచి సంగీతాన్ని రాబట్టుకున్నాడు. ఇప్పటికే పాటలు టాప్ లిస్టులో ట్రెండ్ అవుతున్నాయి.

పాటలు మాత్రమే కాకుండా హోరా హోరీకి కళ్యాణి కోడూరి అందించిన నేపధ్య సంగీతం సినిమాకి ప్రధాన హైలైట్ అవుతుందని ఈ చిత్ర టీం చెబుతోంది. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్న కళ్యాణి కోడూరి ఈ సినిమాకి కూడా ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడని సమాచారం. తేజ మరోసారి నూతన నటీనటులైన దిలీప్ – దక్షలను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ చేసిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెప్టెంబర్ 11న రిలీజ్ కావడానికి సిద్దమైంది.అలా మొదలైంది, అంతక ముందు – ఆ తరువాత సినిమాలతో హిట్స్ అందుకున్న శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై దామోదర ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సురేష్ బాబు భాగస్వామి కావడం సినిమాకి మంరింత పాజిటివ్ టాక్ ని తెచ్చి పెట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు