వాయిదా పడిన నిఖిల్ ‘కార్తికేయ’

వాయిదా పడిన నిఖిల్ ‘కార్తికేయ’

Published on Jul 28, 2014 8:46 PM IST

Karthikeya_Movie_Stills-11

యువకధానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని ఆగష్టు 1న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆగష్టు 1 నుండి వాయిదా వేసారు. ఆంధ్ర – తమిళనాడు బార్డర్లో ఒక టెంపుల్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ కథలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. విజువల్స్ ఎఫెక్ట్స్ వర్క్ చివరి దశలో ఉండడం మరియు సినిమా రిలీజ్ కి కూడా సరైన డేట్ ఉండాలని ఈ చిత్ర టీం సినిమా విడుదలని వాయిదా వేసారు.

త్వరలోనే మరో కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకోవడం వలన ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు