క్లైమాక్స్ కి వచ్చేసిన చిరంజీవి ‘ఖైధీ నెం 150’ !
Published on Oct 31, 2016 5:13 pm IST

khaidi-150-1
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిరంజీవి కూడా పెద్దగా విరామం తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అనుకున్న సమయానికి సినిమాని కంప్లీట్ చేసి జనవరిలో సనాక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ సన్నివేశాలు హైదరాబాద్లో ఈ రోజు నుండి మొదలయ్యాయి. ఈ షెడ్యూల్ వరుసగా 6 రోజుల పాటు జరుగుతుంది. దీంతో దాదాపు సినిమా షూట్ మొత్తం పూర్తైనట్టేనని తెలుస్తోంది.

ఇక ఈ షెడ్యూల్ తరువాత చిరు, కాజల్ లపై చిత్రీకరించాల్సిన రెండు పాటలను ఇటలీలో చిత్రీకరిస్తారు. మరో వైపు ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బ్రంహాండంగా జరుగుతోంది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా హక్కుల కోసం బయ్యర్లు ఫ్యాన్సీ రేటుని ఆఫర్ చేస్తున్నారు. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చరణ్ నిర్మాణంలో వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మెగా అభిమానాలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగనుంది.

 
Like us on Facebook