కమెడియన్ ఎమ్మెస్ నారాయణకు విలన్ రోల్ ఆఫర్.

కమెడియన్ ఎమ్మెస్ నారాయణకు విలన్ రోల్ ఆఫర్.

Published on Oct 24, 2014 5:00 PM IST

ms-Narayana
తెలుగు ప్రేక్షకులను తన నటనతో నవ్వించి, వినోదపు జల్లులలో తడిపించిన ప్రముఖ హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎమ్మెస్ నారాయణ. 700 పైగా సినిమాలలో నటించిన ఎమ్మెస్ ఇటివల ఒక ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. విలన్ పాత్రలో నటించడం తన డ్రీం అని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. ఉప్పలపాటి నారాయణరావు తనకు విలన్ రోల్ ఆఫర్ చేశారని చెప్పారు.

భవిష్యత్ లో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించాలని ఉందని చెప్పిన ఎమ్మెస్ నారాయణ, విలన్ పాత్ర తన నటనలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తుందని చెప్తున్నారు. ఇది ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించే వార్త. ఎందుకంటే, తెలుగులో ఎక్కువ మంది కమెడియన్స్ విలన్స్ గా నటించలేదు. ఆడియన్స్ ఎమ్మెస్ నారాయణను విలన్ పాత్రలో ఎలా రిసీవ్ చేసుకుంటారో కాలమే సమాధానం చెప్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు