జయదేవ్ గల్లా తరపున మహేష్ బాబు ప్రచారం చేస్తాడా?

జయదేవ్ గల్లా తరపున మహేష్ బాబు ప్రచారం చేస్తాడా?

Published on Apr 17, 2014 2:07 PM IST

mahesh-jayadev
సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా సార్లు చాలా పార్టీల నుంచి ప్రచారం చేయమని వచ్చినా తను మాత్రం ప్రచారం చేయడానికి సముఖత చూపలేదు. తాజాగా మహేష్ బాబు చెప్పిన విషయం చూస్తుంటే ఈ సారి ఎలక్షన్స్ లో టిడిపి తరపున గుంటూరు నుంచి ఎంపిగా పోటీచేయనున్న జయదేవ్ గల్లా తరపున ప్రచారం చేస్తాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఈ రోజు మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా తెలిపిన వివరాలు మీ కోసం..

నేను ముందు నుంచి పాలిటిక్స్ కి దూరంగా ఉన్నాను, ఇప్పుడు అంతే..కానీ గుంటూరు నుంచి ఎంపి గా పోటీ చేస్తున్న నా బంధువైన జయదేవ్ గల్లా విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాలి..

జయదేవ్ గల్లా మా సిస్టర్ పద్మని పెళ్లి చేసుకునే టైంకి నేను 13 ఏళ్ళ కుర్రాడిని. అప్పట్లో నాకు అతనే రోల్ మోడల్. మొదటి సారి అతను నా మీద చూపించిన కేర్, నన్ను ట్రీట్ చేసిన విధానం వల్లే అతను విలువలకి ఎంత వాల్యూ ఇస్తాడని తెలిసింది. అలాగే అమరరాజా గ్రూప్, అమరాన్ బ్రాండ్ ని కూడా ఈ రోజు ఈ స్థాయికి తీసుకు వచ్చాడు. ఎంతో గుర్తింపుని, పేరు ప్రఖ్యాతలని సాధించాడు.

నాతో చాలా సార్లు రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పేవాడు, కానీ నేను మాత్రం అయిష్టతని చూపే వాడిని అలాగే ఎందుకు పాలిటిక్స్ అనేది అర్థం అయ్యేది కాదు. అతను ఒకటే చెప్పేవాడు పాలిటిక్స్ లో వెళితేనే ప్రజలలోని క్వాలిటీస్ ని ఇంప్రూవ్ చేయగలమని, అలాగే ఎక్కువమందికి సేవ చేయగలమని చెప్పేవాడు. అతను ఎప్పుడూ చెప్పే మాట ‘ఒక మనిషి కాస్త మార్పును తేగలడు, కానీ అది పరిపూర్ణం కావాలంటే అందరూ ట్రై చెయ్యాలి’.

నేను అతనిని నమ్ముతున్నాను, అలాగే అదను మార్పు తెస్తాడని నమ్ముతున్నాను. అతనికి నా సపోర్ట్ మరియు నా ఓటు ఎప్పుడు ఉంటుంది. నాకు మీ ఒపినియన్ కూడా అలానే ఉంటుదని అనుకుంటానని పోస్ట్ చేసాడు.

దాంతో జయదేవ్ గల్లా టిడిపి పార్టీ కావడంతో మహేష్ బాబు టిడిపి కూడా సపోర్ట్ చేస్తాడని., అలాగే టిడిపి తరపున ప్రచారం చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై మహేష్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు