మహేష్-మురుగదాస్ సినిమా ఫస్ట్‌లుక్ వచ్చేది అప్పుడే..!

Mahesh-babu-murugadoss
సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమా కొద్దిరోజుల క్రితమే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఇక నేడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలవుతుందంటూ కొద్ది కాలంగా బాగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా టీమ్ ఇప్పట్లో ఫస్ట్‌లుక్ విడుదల చేసే ఆలోచన లేనట్లు స్పష్టం చేసేసింది.

ఈ నెలాఖరు వరకూ హైద్రాబాద్‌లోనే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్న టీమ్, సెప్టెంబర్ 6 నుండి చెన్నైలో షూటింగ్ జరుపుకోనుంది. ఇక సగ భాగం షూటింగ్ పూర్తయ్యాక, జనవరి నెలలో, పక్కా ప్లాన్ ప్రకారంగా ఫస్ట్‌లుక్ విడుదల చేయాలని మురుగదాస్ భావిస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ సినిమా హిందీలోకీ డబ్ అయ్యే అవకాశం ఉండడంతో ఫస్ట్‌లుక్ గ్రాండ్‌గా ఉండాలని టీమ్ భావిస్తుందట. మహేష్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సంతోష్ శివన్, హరీస్ జైరాజ్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

Bookmark and Share